YS Bhaskar Reddy Arrest: వైఎస్ భాస్కర్రెడ్డికి పెరిగిన బ్లడ్ ప్రెషర్

ABN , First Publish Date - 2023-04-16T16:10:24+05:30 IST

మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైఎస్‌ భారతి మేనమామ వైఎస్ భాస్కర్‌రెడ్డి (YS Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

YS Bhaskar Reddy Arrest: వైఎస్ భాస్కర్రెడ్డికి పెరిగిన బ్లడ్ ప్రెషర్

హైదరాబాద్: మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైఎస్‌ భారతి మేనమామ వైఎస్ భాస్కర్‌రెడ్డి (YS Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. వివేకా హత్యకేసులో భాస్కర్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం పులివెందుల (Pulivendula)లో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి సీబీఐ జడ్జి ఎదుట హాజరుపర్చాలని అధికారులు భావించారు. అయితే ఉన్నఫలంగా భాస్కర్రెడ్డికి బ్లడ్ ప్రెషర్ (Blood pressure) పెరిగింది. బీపీ 170 ఉండడంతో సెలైన్ ఎక్కించి ఉస్మానియా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలాగే 2D ఎకో పరీక్ష చేస్తున్నారు.

వివేకా హత్యకేసులో కుట్రదారుడిగా భాస్కర్‌రెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు మొదట ప్రచారం చేశారు. గుండెపోటుగా ప్రచారంలో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాలు చెరిపేయడంలో ఆయన పాత్ర ఉందని సీబీఐ చెబుతోంది. వివేకా హత్య ముందు భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్‌ ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా గుర్తించామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. వివేకా కేసులో భాస్కర్ రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున ముఖేష్ శర్మ నేతృత్వంలోని సీబీఐ బృందం అరెస్ట్ చేసింది. ఉదయం 6.10 నుంచి భాస్కర్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత భాస్కర్‌రెడ్డి ఇంట్లోకి ఎవర్నీ సీబీఐ అనుమతించలేదు. అయితే కీలక ఆధారాలు సేకరించినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.

భాస్కర్ రెడ్డి ఇంట్లోనే అరెస్ట్ మెమోను సీబీఐ సిద్ధం చేసింది. తన ఇంట్లోకి లాయర్‌ను అనుమతించాలని పదేపదే భాస్కర్ రెడ్డి కోరారు. అరెస్ట్ మెమోలో ఏముందో తమ లాయర్ ద్వారా తెలుసుకుంటామని భాస్కర్ రెడ్డి.. అధికారులను అడిగారు. ఆయన వినతిపై అధికారులు స్పందించలేదు. రెండు రోజుల క్రితం ఇదే కేసులో అవినాశ్‌రెడ్డి (YS Avinash Reddy)కి అత్యంత సన్నిహితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ బృందం అరెస్టు చేసింది. ఇప్పటికే సీబీఐ బృందం ఆరుగురిని అరెస్టు చేసింది. ఇప్పుడు భాస్కర్‌రెడ్డి అరెస్టుతో ఈ సంఖ్య ఏడుకు చేరింది.

Updated Date - 2023-04-16T16:12:00+05:30 IST