Demart : డీమార్ట్ లాభం రూ.590 కోట్లు
ABN , First Publish Date - 2023-01-15T00:10:51+05:30 IST
డీ-మార్ట్ బ్రాండ్‌నేమ్‌తో గొలుసుకట్టు సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబరుతో
న్యూఢిల్లీ: డీ-మార్ట్ బ్రాండ్‌నేమ్‌తో గొలుసుకట్టు సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) రూ.589.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఇదే కాలానికి నమోదైన రూ.552.53 కోట్ల లాభంతో పోలిస్తే 6.71 శాతం అధికమిది. కాగా, ఈ క్యూ3లో అవెన్యూ సూపర్ మార్ట్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25.50 శాతం వృద్ధి చెంది రూ.11,569.05 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వ్యయాలు సైతం 27.02 శాతం పెరిగి రూ.10,788.86 కోట్లకు చేరుకున్నాయి.