17,200 వద్ద నిరోధం

ABN , First Publish Date - 2023-03-27T02:12:17+05:30 IST

నిఫ్టీ గత సోమవారం కీలకమైన 17,000 స్థాయిలకు దిగువకు చేరినప్పటికీ ఆ తర్వాత రికవరీ సాధించి 17,200 వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక పోయింది. అంతేకాకుండా...

17,200 వద్ద  నిరోధం

టెక్‌ వ్యూ

నిఫ్టీ గత సోమవారం కీలకమైన 17,000 స్థాయిలకు దిగువకు చేరినప్పటికీ ఆ తర్వాత రికవరీ సాధించి 17,200 వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేక పోయింది. అంతేకాకుండా ఎలాంటి అప్‌ట్రెండ్‌ను సూచించలేదు. చివరకు వారాంతంలో 150 పాయింట్లు నష్టపోయి 17,000 దిగువన క్లోజైంది. గడిచిన పది రోజులుగా ప్రధాన మానసిక అవధి స్థాయిలైన 17,000 పాయింట్ల వద్ద పూర్తిగా ఆటుపోట్లకు లోనవుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ స్థాయిల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొంటూ తదుపరి దిశను తీసుకునేందుకు సిద్ధమవుతోంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండ టం మంచిది. గత శుక్రవారం అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లు రికవరీ సాధించటంతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

టెక్నికల్‌గా కీలకమైన 17,000 స్థాయిల ఎగువన బౌన్స్‌ బ్యాక్‌ కావచ్చు. కీలక నిరోధ స్థాయిలైన 17,200 ఎగువన కొద్ది రోజుల పాటు నిలదొక్కుకుంటేనే పాజిటివ్‌ ట్రెండ్‌కు సంకేతాలు వెలువరిస్తుంది.

బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 17,110 ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి నిరోధ స్థాయి 17,200. కొద్ది రోజులుగా ఈ స్థాయిల వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 17,500.

బేరిష్‌ స్థాయిలు: మరింత బలహీనతను కనబరిస్తే మాత్రం ప్రస్తుత మద్దతు స్థాయిలైన 16,900 ఎగువన కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రఽధాన మద్దతు స్థాయిలు 16,700-16,500. ఇవి గతంలో ఏర్పడిన బాటమ్‌ స్థాయిలు. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ ప్రధాన మద్దతు స్థాయిలైన 40,000 వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమైంది. చివరకు 200 పాయింట్ల నష్టంతో 39,800 క్లోజైంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధ స్థాయి 40,000 వద్ద నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి మద్దతు స్థాయి 39,000.

పాటర్న్‌: మార్కెట్‌ ఇప్పటికీ స్వల్పకాలిక చలన సగటుకు దిగువనే ఉంది. ప్రస్తుతం నిఫ్టీ 16,900 వద్ద డబుల్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచుకుంది. సానుకూల ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. 17,200 వద్ద సమాంతరంగా దిగువకు ఏర్పడిన మద్దతు ట్రెండ్‌లైన్‌ సమీపంలో తదుపరి నిరోధ స్థాయిలున్నాయి. స్వల్పకాలిక సానుకూల ట్రెండ్‌ కోసం ఇక్కడ కచ్చితంగా బ్రేకౌట్‌ సాధించాల్సి ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 17,060 17,110

మద్దతు : 16,950 16,900

వి. సుందర్‌ రాజా

Updated Date - 2023-03-27T02:12:17+05:30 IST