Uganda: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో తొక్కిసలాట.. 9 మంది మృతి

ABN , First Publish Date - 2023-01-01T17:23:54+05:30 IST

ఉగాండా(Uganda)లో ఆదివారం ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన తొక్కిసలాట (Stampede)లో 9 మంది ప్రాణాలు

Uganda: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో తొక్కిసలాట.. 9 మంది మృతి
kampala

కంపాలా: ఉగాండా(Uganda)లో ఆదివారం ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన తొక్కిసలాట (Stampede)లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కంపాలాలోని ఫ్రీడం సిటీ షాపింగ్‌మాల్‌(Freedom City mall )లో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకల (New Year celebrations) సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా ప్రదర్శనను తిలకించేందుకు అర్ధరాత్రి ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ వద్దకు తరలిరావడంతో ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది.

బాణసంచా (Firworks) ప్రదర్శన ముగిసిన తర్వాత జనం తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్టు కంపాలా(Kampala) పోలీసులు తెలిపారు. వేడుకల సందర్భంగా నిర్లక్ష్యం చోటుచేసుకుందని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో పలువురు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు.

Updated Date - 2023-01-01T18:52:24+05:30 IST