Share News

Bader Khan Soori: అమెరికా అధికారుల అదుపులో భారత పరిశోధకుడు బదర్‌ఖాన్‌ సూరి

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:48 AM

ఆయన హమా్‌సకు అనుకూలంగా, యూదులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆయనను అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. విద్యార్థి వీసా కలిగి ఉన్న బదర్‌ ఖాన్‌ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే పోస్ట్‌డాక్టరల్‌ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు.

Bader Khan Soori: అమెరికా అధికారుల అదుపులో భారత పరిశోధకుడు బదర్‌ఖాన్‌ సూరి

వాషింగ్టన్‌, మార్చి 20: అమెరికాలోని జార్జిటౌన్‌ యూనివర్సిటీలో భారత పరిశోధకుడు బదర్‌ ఖాన్‌ సూరిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన హమా్‌సకు అనుకూలంగా, యూదులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆయనను అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. విద్యార్థి వీసా కలిగి ఉన్న బదర్‌ ఖాన్‌ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే పోస్ట్‌డాక్టరల్‌ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. బదర్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో హమా్‌సకు అనుకూలంగా, యూదులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు డీహెచ్‌ఎ్‌స(హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం) అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. హమా్‌సకు సీనియర్‌ సలహాదారుగా ఉన్న ఒక అనుమానిత ఉగ్రవాదితోనూ అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం లూసియానాలోని ఐసీఈ(ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) నిర్బంధ కేంద్రంలో బదర్‌ ఖాన్‌ను ఉంచారు. ఈ నిర్బంధాన్ని బదర్‌ ఖాన్‌ న్యాయవాది కోర్టులో సవాల్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 05:10 AM