Finland: ఫిన్లాండ్.. సంతోషాల చిరునామా
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:08 AM
అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ (మార్చి 20) సందర్భంగా గురువారం విడుదల చేసిన ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025’లో ఫిన్లాండ్ మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 147 దేశాలను ఈ సర్వేలో భాగస్వామ్యం చేయగా.. గతేడాది 126వ స్థానంలో ఉన్న భారత్ ఎనిమిది ర్యాంకులు మెరుగుపడి 118వ స్థానానికి చేరుకుంది.

హ్యాపీయెస్ట్ కంట్రీగా మళ్లీ అగ్రస్థానం
భారత్‌కు 118..పాక్‌కు 109వ ర్యాంకు
న్యూఢిల్లీ, మార్చి 20: సంతోషాలకు చిరునామా ఫిన్లాండ్.. అని మరోసారి స్పష్టమైంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ (మార్చి 20) సందర్భంగా గురువారం విడుదల చేసిన ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025’లో ఫిన్లాండ్ మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 147 దేశాలను ఈ సర్వేలో భాగస్వామ్యం చేయగా.. గతేడాది 126వ స్థానంలో ఉన్న భారత్ ఎనిమిది ర్యాంకులు మెరుగుపడి 118వ స్థానానికి చేరుకుంది. కానీ.. నేపాల్ (92), పాలస్తీనా (108), పాకిస్థాన్ (109), ఉక్రెయిన్ (111) కంటే భారత్ వెనకబడడం గమనార్హం. ఈ జాబితాలో అఫ్ఘానిస్థాన్ 147వ ర్యాంకుతో అట్టడుగున నిలిచింది. ఈ జాబితాలో మన పొరుగున ఉన్న దేశాలైన శ్రీలంక 133, బంగ్లాదేశ్ 134, చైనా 68వ స్థానాల్లో నిలిచాయి. పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఐరోపా దేశాలు టాప్-20లో ఆధిపత్యం చలాయించాయి. అమెరికా 24వ స్థానానికి, బ్రిటన్ 23వ స్థానానికి పడిపోయాయి.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..