Share News

Mallikarjun Kharge: నా కులం మీద కూడా దాడి జరిగింది: ఖర్గే

ABN , Publish Date - Dec 20 , 2023 | 04:11 PM

రాజకీయ నాయకులు రెచ్చగొట్టే భాష వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. పార్లమెంటు వెలుపల టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీ వివాదంపై జగ్దీప్ ధన్‌ఖడ్ రాజ్యసభలో 'కులం' ప్రస్తావన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తనపై వ్యక్తిగత దాడి జరిగిందని, ఒక రైతు కులాన్ని అవమాన పరిచారని జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొనాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకని ఖర్గే ప్రశ్నించారు.

Mallikarjun Kharge: నా కులం మీద కూడా దాడి జరిగింది: ఖర్గే

న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు రెచ్చగొట్టే భాష వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సూచించారు. పార్లమెంటు వెలుపల టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీ వివాదంపై (Mimicry row) జగ్దీప్ ధన్‌ఖడ్ రాజ్యసభలో 'కులం' ప్రస్తావన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తనపై వ్యక్తిగత దాడి జరిగిందని, ఒక రైతు కులాన్ని అవమాన పరిచారని జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొనాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకని ఖర్గే ప్రశ్నించారు. ''ఎవరూ ఇలా మాట్లాడకూడదు. రెచ్చగొట్టే మాటలకు దూరంగా ఉండాలి'' అని ఖర్గే బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


''చైర్మన్ తనను కులం కారణంగానే అవమానించారని, రైతులను అవమానపరిచారని మాట్లాడారు. నిజానికి ఎన్నో సార్లు నాకు కూడా సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నా కులంపై కూడా దాడి జరిగింది. కానీ నేను ఎప్పుడూ ఆ మాట మాట్లాడలేదు'' అని ఖర్గే అన్నారు. 140 మందికి పైగా ఎంపీలను ఉభయసభల నుంచి సస్పెండ్ చేయడంపై విపక్ష ఎంపీలు మంగళవారంనాడు పార్లమెంటు వెలుపల ''మాక్ పార్లమెంటు'' నిర్వహించడం, ధన్‌ఖడ్ తరహాలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, ఈ ఘట్టాన్ని రాహుల్ గాంధీ వీడియోలో చిత్రీకరించడం వివాదమైంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Dec 20 , 2023 | 04:11 PM