Share News

యూకేను వీడనున్న లక్ష్మీ మిత్తల్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:15 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్‌ మిత్తల్‌ మాజీ సీఈవో లక్ష్మీ మిత్తల్‌ బ్రిటన్‌ను వీడనున్నారు.

యూకేను వీడనున్న లక్ష్మీ మిత్తల్‌

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్‌ మిత్తల్‌ మాజీ సీఈవో లక్ష్మీ మిత్తల్‌ బ్రిటన్‌ను వీడనున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న ఆయన.. యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ దేశాన్ని వీడాలని అనుకున్నట్లు సమాచారం. నాన్‌ డోమ్‌ పన్ను విధానాన్ని రద్దుచేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పన్ను విధానం కింద యూకేలో నివసించే వారు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయన ఏప్రిల్‌లో కొత్త నిబంధనలు అమలులోకి రాకముందే యూకే నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆయన యూకేను వీడి సంపన్నులకు ఆకర్షణీయమైన పన్ను ప్రోత్సాహకాలను అందించే దుబాయ్‌, స్విట్జర్లాండ్‌, ఇటలీ వంటి దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మిట్టల్‌ 1995లో యూకేకు వెళ్లారు. ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం, మిత్తల్‌ సంపద 14.9 బిలియన్‌ పౌండ్లుగా ఉంది.

Updated Date - Mar 29 , 2025 | 06:15 AM