Myanmar Earthquake: మయన్మార్‌లో మృత్యుఘోష.. భారీ భుకంపంలో 144 మంది మృతి
ABN , Publish Date - Mar 28 , 2025 | 09:36 PM
మాండలేలోని రోడ్లు భారీ ఎత్తున పగుళ్లు తీయడం, హైవేలు తీవ్రంగా దెబ్బతినడం, వంతెనలు కుప్పకూలడంతో రెస్యూ ఆపరేషన్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భూకంప తాకిడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో క్షతగ్రాతుల తక్షణ చికిత్స కోసం అవసరమైన బ్లడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందంటూ వార్తలు వస్తున్నాయి.

నైఫిడో: మయన్మార్ శుక్రవారంనాడు భారీ కంపాలతో చిగురులాటుగా వణికిపోయింది. 12 సెకెండ్ల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించడంతో ఆపార జననష్టం సంభవించింది. 144 మంది మృత్యువాత పడగా, 730 మందికి పైగా గాయపడినట్టు మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ప్రకటించింది. భవానాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు జరుగుతుండంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తు్న్నారు. లెక్కకు మిక్కిలిగా భవనాలు నేలమట్టం కావడం, ఆకాశహర్మ్యాలు, వంతెనలు కుప్పకూలినట్టు ఫోటోలు, వీడియోలు వెలుగుచూస్తుండగా నష్టం పెద్దఎత్తునే జరిగి ఉండవచ్చనే కథనాలు వెలువడుతున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు కాగా, మయన్మార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో భూకంప నమోదు కేంద్రాన్ని గుర్తించారు. తొలి భూకంపం సంభవించిన సెకన్లలోనే 6.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించడంతో మరింత తీవ్రనష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు
మాండలేలోని రోడ్లు భారీ ఎత్తున పగుళ్లు తీయడం, హైవేలు తీవ్రంగా దెబ్బతినడం, వంతెనలు కుప్పకూలడంతో రెస్యూ ఆపరేషన్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భూకంప తాకిడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో క్షతగ్రాతుల తక్షణ చికిత్స కోసం అవసరమైన బ్లడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందంటూ వార్తలు వస్తున్నాయి. తొలుత మయన్మార్‌లో భూకంప తీవ్రతగా 20 మంది వరకూ మృతి చెందినట్టు మీడియా కథనాలు వచ్చినప్పటికీ అనేక భవనాలు ఊగిపోవడం, క్షణాల్లో కుప్పకూలడంతో జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలిపోవడంతో కార్మికులు పరుగులు పెట్టారు. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయిట్టు కథనాలు వచ్చాయి.
ఆదుకుంటున్నామన్న మోదీ.. భారత్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్
మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపంపై భారత్ వెంటనే స్పందించింది. రెండు దేశాలకు అవసరమని సాయం అందజేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరి భద్రత సంక్షేమ కోసం ప్రార్థిస్తున్నట్టు మోదీ ట్వీట్ చేశారు. అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని అధికారులను కోరినట్టు ఆయన పేర్కొన్నారు. మయన్మార్, థాయిలాండ్ ప్రభత్వాలతో సంప్రదింపులు జరపాల్సిందిగా విదేశాంగ శాఖను కోరామని తెలిపారు. థాయ్‌లాండ్‌లోనూ భూకంపంతో 8 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు. అయితే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కాగా, థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ హెల్త్‌లైన్ ఏర్పాటు చేసింది. +66 618819218 హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని కోరింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి