Share News

Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులు

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:23 AM

లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు చేసింది. బీరుట్‌ దక్షిణ శివార్లలోని దహియేపై జరిగిన క్షిపణి దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.

Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులు

టెల్‌ అవీవ్‌, బీరుట్‌, గాజా, మార్చి28: లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు చేసింది. బీరుట్‌ దక్షిణ శివార్లలోని దహియేపై జరిగిన క్షిపణి దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్‌-హెజ్బుల్లా మధ్య గత నవంబరులో కాల్పుల విరమణ కుదిరాక తొలిసారిగా జరిగిన ఈ దాడితో లెబనాన్‌లో కలకలం రేగింది. లెబనాన్‌ నుంచి తమపై గత శనివారంతో పాటు శుక్రవారం కూడా రాకెట్‌ దాడులు జరిగాయని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. రెండో సారి కూడా రాకెట్‌ దాడులు జరగడంతో నెతన్యాహు ప్రభుత్వం ప్రతిదాడులకు ఆదేశించింది. బీరుట్‌లో హెజ్బుల్లా ఆయుధ స్ధావరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ బలగాలు ప్రకటించాయి. కాగా, ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించినవారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని లెబనాన్‌ ప్రధాని నవాఫ్‌ సలామ్‌ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆదేశించారు.

Updated Date - Mar 29 , 2025 | 06:26 AM