Share News

Supreme Court: భావ స్వేచ్ఛ నాగరిక సమాజ సహజ లక్షణం

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:19 AM

భావ స్వేచ్ఛ ఆరోగ్యకర, నాగరిక సమాజ సహజ లక్షణమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది.

Supreme Court: భావ స్వేచ్ఛ నాగరిక సమాజ సహజ లక్షణం

కాంగ్రెస్‌ ఎంపీ రాసిన కవితపై కేసు కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ, మార్చి 28: భావ స్వేచ్ఛ ఆరోగ్యకర, నాగరిక సమాజ సహజ లక్షణమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. దీన్ని కాపాడడం న్యాయస్థానాల కర్తవ్యమని స్పష్టం చేసింది. కవిత రాసినందుకు కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్‌ ప్రతా్‌పగరీపై గుజరాత్‌ పోలీసులు పెట్టిన కేసును కొట్టివేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఆ కవిత ద్వారా శాంతి సందేశాన్ని అందించారని తెలిపింది. జామ్‌నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రతాప్ గరీ ‘ఏ ఖూన్‌ కే ప్యాసే బాత్‌ సునో (రక్త దాహార్తుల్లారా వినండి) శీర్షికన ఓ కవిత రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే ఇది విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ జనవరి మూడో తేదీన జామ్‌నగర్‌ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు

Updated Date - Mar 29 , 2025 | 06:20 AM