Heart disease: గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకునేవాళ్లు వారంలో రెండు రోజులు ఇలా చేయండి చాలు..

ABN , First Publish Date - 2023-04-07T12:44:25+05:30 IST

ఒకటి, రెండు రోజుల నడక నడిచిన వారిలో మరణాల రేటు 14.9% తక్కువగా ఉంది.

Heart disease: గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకునేవాళ్లు వారంలో రెండు రోజులు ఇలా చేయండి చాలు..
lower the risk of death

నడక మన ఆరోగ్యానికి మంచి చేస్తుందని అందరూ చెప్పే మాటే.. అయితే నడక మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగమైన గుండెకు అంతకన్నా మంచి చేస్తుందట. దీనికోసం రోజూ తెల్లవారుజామునే లేచి బద్దకంగా నడకకు బయలుదేరాల్సిన పనిలేదట. వారంలో అదీ రెండు రోజులు నడిస్తే చాలట. అదీ ముఖ్యంగా వారాంతాల్లో రోజుకు 8,000 అడుగులు నడవడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఒక పరిశోధనా బృందం కనుగొంది.

మనలో చాలా మంది వారాంతంలో మన శరీరానికి కేటాయించడానికి సమయాన్ని నడకతోనే భర్తీ చేస్తారు. దీనికి జీవనశైలి మార్పులు, స్థూలకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు, స్ట్రోక్, కొన్ని క్యాన్సర్‌లకు పెరుగుతున్న కారణం, నడక వైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణం, పెద్దగా శ్రమపడకుండానే వ్యాయామం చేస్తున్నామనే ఫీల్ తో ఒత్తిడి, ఆందోళనను దాటవచ్చుననే దీనిని ఎంచుకుంటారు.

వారానికి ఒకటి లేదా రెండు రోజులలో ప్రతిరోజూ కనీసం 8,000 అడుగులు నడిచే వ్యక్తులు 10 సంవత్సరాల తర్వాత మరణించే ప్రమాదం తగ్గిందని, వారానికి మూడు నుండి ఏడు రోజులు అదే మొత్తంలో నడిచే వ్యక్తులతో సమానంగా ఉంటుందని తెలిపింది. ఈ అధ్యయనంలో క్యోటో యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కూడా ఉంది. ఈ అధ్యయనం గత నెలలో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ యొక్క JAMA నెట్‌వర్క్ ఓపెన్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడింది.

ఇది కూడా చదవండి: మితంగా ఆల్కాహాల్ తాగడం ఆరోగ్యకరమా? ఎన్నో ఏళ్ల ప్రశ్నకు నూతన అధ్యాయనం సమాధానం ఇదే..

దీని ప్రకారం, రోజుకు 8,000 అడుగులు, అంతకంటే ఎక్కువ నడవడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని మునుపటి పరిశోధనలో తేలింది. కానీ నడిచేందుకు గడిపిన రోజుల సంఖ్యను బట్టి ప్రమాదం ఎలా మారుతుందోననే విషయంలో మాత్రం అస్పష్టంగా ఉంది.

ఈ బృందం 2005, 2006 మధ్య U.S. జాతీయ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం, 20 అంతకంటే ఎక్కువ వయస్సు గల 3,101 మంది వ్యక్తులు నడిచే రోజువారీ నడకను అధ్యయనం చేశారు, సగటు వయస్సు 50.5 , 10 సంవత్సరాల తరువాత మరణించే ప్రమాదం ఉందని తేలిందట. ఏడు రోజులలో రోజుకు కనీసం 8,000 అడుగులు నడిచిన వారిలో, మూడు నుండి ఏడు రోజుల నడక మరణాల రేటు 16.5% తక్కువగా నమోదు అయింది, అయితే ఒకటి, రెండు రోజుల నడక నడిచిన వారిలో మరణాల రేటు 14.9% తక్కువగా ఉంది.

ఈ పరిశోధనా బృందం మరణానికి కారణాన్ని గుండె, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులకు పరిమితం చేసినప్పుడు, ఈ మరణాల రేటు మూడు నుండి ఏడు రోజుల మధ్య 8.4% తక్కువగా ఉంది. అదే ఒకటి, రెండు రోజుల వారిలో 8.1% తక్కువగా ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఇలాంటి పోకడలు గమనించారు.

Updated Date - 2023-04-07T12:44:42+05:30 IST