అబద్ధం ప్రాణాంతకం!

ABN , First Publish Date - 2023-09-13T23:59:07+05:30 IST

పూర్వకాలం గరుడవాహన అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో సుదేష్ణుడు అనే ఒక మంచి వడ్రంగి ఉండేవాడు...

అబద్ధం ప్రాణాంతకం!

పూర్వకాలం గరుడవాహన అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో సుదేష్ణుడు అనే ఒక మంచి వడ్రంగి ఉండేవాడు. అతను రకరకాల వస్తువులు తయారుచేస్తూ ఉండేవాడు. సుదేష్ణుడు చాలా కష్టపడి ఒక పక్షిలాంటి వాహనాన్ని తయారుచేశాడు. దానికి కొన్ని తాళాలు ఉండేవి. ఆ తాళాలు ఒక వైపు తిప్పితే అది గాలిలోకి ఎగిరేది. ఒక రోజు సుదేష్ణుడు ఆ పక్షి మీద ఎగురుతూ ఉంటే రాజు చూశాడు. ఆకాశంలో విష్ణువు విహరిస్తున్నాడని భావించి- సుదేష్ణుడిని రాజమందిరానికి తీసుకువెళ్లి సకల మర్యాదలు చేశాడు. సుదేష్ణుడు ఆ రాచమర్యాదలకు అలవాటు పడి తానే విష్ణువునని చెప్పుకొని తిరగటం మొదలుపెట్టాడు. ఇంతలో పొరుగురాజు ఒకరు సుదేష్ణుడి రాజ్యంపైకి దండెత్తాడు. అప్పుడు రాజు- సుదేష్ణుడి దగ్గరకు వచ్చి- ‘మహావిష్ణు.. నువ్వు ఉండగా మాకు ఎటువంటి ప్రమాదం ఉండదు.. అందుకే పొరుగురాజుతో సంధి వద్దనుకున్నా. నువ్వే మమల్ని కాపాడాలి’ అని ప్రార్థించాడు. సుదేష్ణుడు సంకటస్థితిలో పడ్డాడు. నిజం చెబితే రాజుప్రాణం తీస్తాడు. చెప్పకపోతే యుద్ధంలో ప్రాణాలు పోతాయి. రాజు చేతిలో కన్నా.. యుద్ధంలో ప్రాణం పోతేనే మంచిదని భావించి- సుదేష్ణుడు పక్షి వాహనం మీద యుద్ధానికి వెళ్లాడు. ఆ వాహనానికి సమస్య వచ్చి శత్రు సైనికుల మధ్యలో కూలిపోయింది. దీనితో శత్రుసైనికులు ఆకాశం నుంచి ఏదో వింత పక్షి దాడి చేస్తోందని భావించి పారిపోయారు. సుదేష్ణుడు కూడా బ్రతుకుజీవుడా అని యుద్ధ రంగం నుంచి వేరే ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ మళ్లీ వడ్రంగి పని మొదలుపెట్టాడు. ఒక అబద్ధం చెబితే అది ప్రాణాల మీదకు రావచ్చనే సత్యాన్ని

తెలుసుకున్నాడు

Updated Date - 2023-09-13T23:59:07+05:30 IST