NRI: వాషింగ్టన్ డీసీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ABN , First Publish Date - 2023-08-17T11:45:40+05:30 IST
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జనగణమన ఆలపించారు. ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు మైనేని మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. వారు చేసిన త్యాగాల ఫలితంగా దేశానికి స్వేచ్ఛా వాయువులు లభించాయని అన్నారు. వారి స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మైనేని రాంప్రసాద్ అన్నారు.
భాను మాగులూరి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర స్వయం సమృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలకపాత్ర పోషించాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా నేడు దేశం ప్రగతిపథంలో ముందుకెళ్తోందని తెలిపారు. ప్రపంచంలో భారతదేశ జెండా రెపరెపలాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీ రమణారావు, యండమూరి నాగేశ్వరరావు, పావులూరి అమ్మారావు, పాకాలపాటి కృష్ణయ్య, జీవన్ రెడ్డి, కోట రామ్మోహన్ రావు, బండ మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.