Share News

TS Assembly Polls : ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కేసీఆర్!!

ABN , First Publish Date - 2023-11-10T20:33:53+05:30 IST

Telangana Congress : అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ పడింది. ఇన్నిరోజులు చేరికలపై పెద్దగా దృష్టిపెట్టని బీఆర్ఎస్.. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నేతలకు కారులో చోటు ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్‌లోని అసంతృప్తులు, టికెట్లు దక్కని సిట్టింగ్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే..

TS Assembly Polls : ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కేసీఆర్!!

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ పడింది. ఇన్నిరోజులు చేరికలపై పెద్దగా దృష్టిపెట్టని బీఆర్ఎస్.. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నేతలకు కారులో చోటు ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్‌లోని అసంతృప్తులు, టికెట్లు దక్కని సిట్టింగ్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో హస్తం పార్టీ హౌస్‌ఫుల్ అయ్యి.. టికెట్లు ఎవరికి ఇవ్వాలో, ఎవరిని పక్కనెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఆఖరికి సొంత పార్టీ ముఖ్య నేతలు, సీనియర్లను సైతం పక్కనెట్టి టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకట్రెండు స్థానాల్లో తప్పితే మిగిలిన చోట అంతా కాంగ్రెస్ హైకమాండ్ అనుకున్నట్లే జరిగింది. కానీ.. పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ సీన్ మొత్తం రివర్స్ అవుతోంది.


Khammam-Cherika-1.jpg

అసలేం జరిగింది..?

టికెట్లు, బీఫామ్‌లు, మార్పులు-చేర్పులు, నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు రిలీఫ్ అవుతుండగా.. సరిగ్గా ఇదే సమయంలో సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగి.. బీఆర్ఎస్ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆయా నియోజకవర్గాలు, జిల్లాలపై కన్నేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల ముఖ్య అనుచరులు, ద్వితియ శ్రేణి నేతలు, టికెట్లు ఆశించగా రాని నేతలను.. కాంగ్రెస్ క్యాడర్‌ను కారెక్కించే పనిలో పడ్డారు బాస్. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని సంకేతాలు వస్తున్న తరుణంలో ఇక్కడే దెబ్బ కొట్టాలని గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ ఇద్దరు ఎప్పుడైతే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో ఖమ్మంలో ‘కారు’కు పంచర్ అయినట్లయ్యింది.!. దీంతో ఆ ఇద్దరి స్థానాలను భర్తీ చేసేందుకు ఇప్పటికే కొందరు ముఖ్య నేతలకు గులాబీ కండువా కప్పి టికెట్లు కూడా కేటాయించారు. అంతటితో ఆగని కేసీఆర్.. జిల్లాలోని సీనియర్ నేతలు, కాంగ్రెస్ ప్రముఖులను, ముఖ్యనేతలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. సీఎం పిలుపుతో ఒక్కసారిగా భారీగా చేరికలు జరిగాయి. దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ కుదుపు అయినట్లయ్యింది.

Khammam-Cherika.jpg

ఎవరెవరు చేరారు..?

మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, పీసీసీ అధ్యక్షుడి అత్యంత సన్నిహితుడు, విద్యార్థినేతగా పేరున్న కూటూరి మానవతారాయ్, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత వూకె అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్.. వీరితో పాటు పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేతలందరికీ గులాబీ కండువా కప్పిన కేసీఆర్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అధికారంలోకి రాగానే వీరందరికీ తగిన ప్రాధాన్యత, పదవులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చేరికలపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Khammam-Cherika-3.jpg


ఇవి కూడా చదవండి


CM KCR : కేసీఆర్ ఆస్తులు తెలుసుకుని ఆశ్చర్యపోతున్న జనం.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!?


Komatireddy : ర్యాలీ జోష్‌లో నామినేషన్ మరిచిన రాజగోపాల్.. ఆఖరి నిమిషంలో ఉరుకులు, పరుగులు..!!


TS Assembly Polls : 2023 ఎన్నికల్లో ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్‌‌.. ప్లాన్ అదిరిపోయిందిగా..!!


Updated Date - 2023-11-10T20:53:48+05:30 IST