AC: ఏసీలు ఎందుకు కాలిపోతుంటాయ్..? ఈ 4 అంశాలే అసలు కారణాలు.. గది చల్లగానే ఉంది కదా అని పట్టించుకోరు కానీ..!
ABN , First Publish Date - 2023-06-14T13:38:16+05:30 IST
ఇప్పటి కాలంలో మధ్యతరగతి ఇళ్ళలో కూడా ఏసీలు ఉంటున్నాయి. కష్టమయినా సరే వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ నాలుగు అంశాలు ఏసీలు కాలిపోవడానికి కారణం అవుతున్నాయి.
ఇప్పటికాలంలో చాలా మధ్యతరగతి ఇళ్ళలో కూడా ఏసీలు ఉంటున్నాయి. బయట ఎండలు మండిపోతుంటే ఇళ్ళలో చల్లని ఏసీ గదులలో పడుకోవడం ఎవరికైనా ఇష్టమే. అయితే.. చాలా చోట్ల ఏసీలు కాలిపోయాయనే మాట వింటుంటాం. ఏసీ కాలిపోవడం కారణంగా ఇళ్లు కూడా తగలబడిపోతుంటాయి. దీనివల్ల ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంది. కష్టమయినా సరే వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఏసీల కారణంగా అలా నష్టం జరగడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. రూమంతా చల్లగా ఉందిలే అని ప్టటించుకోరు కానీ నాలుగు అంశాలు ఏసీలు కాలిపోవడానికి కారణం అవుతాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడటం ద్వారా నష్టాన్ని అరికట్టవచ్చు.
ఏసీలు కాలిపోయి(AC firing) ఇళ్ళలో మంటలు చెలరేగి చాలా చోట్ల ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఏసీలు కాలిపోవడం వెనుక కారణాలు ఉన్నాయి. ఏసీలు కాలిపోవడానికి ప్రధాన కారణం సర్వీసింగ్(AC servicing) సరిగా లేకపోవడం. ఏసీని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. లేకపోతే ఏసీ లోపల దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. వీటి కారణంగా ఏసీ లోపల అధికవేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి ఏసీ కాలిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఏసీని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తుండాలి. దుమ్ము, ధూళి తొలగిస్తుండాలి.
Bathing: రోజుకు రెండుసార్లు స్నానం చేస్తున్నా సరే.. అందరూ కామన్‌గా చేసే ఒకే ఒక్క మిస్టేక్ ఇదే.. తప్పు చేస్తున్నామని తెలియకుండానే..!
ఏసీకి దగ్గరలో మండే పదార్థాలు(combustible materials) ఉండటం వల్ల కూడా ఏసీలు కాలిపోతాయి. ఏసీ వెనుక భాగంలో ఎండిన ఆకులు, కాగితాలు వంటివి ఉంటే ఏసీ నుండి విడుదల అయ్యే వేడి కారణంగా అవి అంటుకుని మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.
ఎయిర్ కండీషనర్లు సరిగా శుభ్రం(AC cleaning)చేయకపోతే వాటి ఫిల్టర్లలో(AC Filters), కాయిల్స్ లో(coils), వాటి స్లైడ్స్(AC slides) లో దుమ్ము, ధూళి పేరుకుతుంది. ఇవి గాలి ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల ఏసీ పనితీరు దెబ్బతిని వేడెక్కుతుంది. ఇదే చివరికి ఏసీ కాలిపోవడానికి కారణమవుతుంది.
చవకగా లభించేవాటి పట్ల చాలామంది ఈజీగా ఆకర్షితులవుతారు. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని నాసిరకం ఏసీలు(cheap quality AC) కొనుగోలు చేయడం, ఏసీలలో ఉపయోగించే పరికరాలు నాసిరకమైనవి ఉపయోగించడం(using cheap material) వంటివి చేస్తే నష్టమే మిగులుతుంది. నాసిరకమైన భాగాలు ఏసీ పనితీరుకు సరిపోవు. మరీ ముఖ్యంగా ఏసీ ఎక్కువ సేపు నిరంతరాయంగా ఉపయోగించినప్పుడు తొందరగా దాని పనితీరు క్షీణిస్తుంది. ఈ కారణంగా ఆయా భాగాలు ఫెయిలయ్యి కాలిపోయే ప్రమాదం ఉంది.
చల్లని గాలి వస్తోందిలే ఇంకేంటి అని నిర్లక్ష్యం చేయకుండా ఈ నాలుగు విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే ఏసీ వల్ల ప్రమాదాలు జరగకుండా చేయచ్చు