Share News

Viral Video: ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడం గ్యారెంటీ.. విరిగిపోని మంచాన్ని ఎలా తయారు చేశాడంటే..

ABN , Publish Date - Mar 22 , 2025 | 08:09 PM

డబుల్ కాట్ మంచాన్ని ఎవరైనా చెక్కతో తయారు చేస్తారు. కొందరు ఎక్కువ డబ్బులు వెచ్చించి, మంచి కలపను వినియోగిస్తారు. అయితే ఇదంతా రొటీన్ అనుకున్నాడో ఏమో గానీ.. ఓ వ్యక్తి వినూత్నంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరకు ఇతను చేసిన ప్రయోగం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Viral Video: ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడం గ్యారెంటీ.. విరిగిపోని మంచాన్ని ఎలా తయారు చేశాడంటే..

కొందరు అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచిస్తుంటారు. మరికొందరు ఆలోచించడమే కాకుండా వాటిని ఆచరణలో పెడుతుంటారు. ఇంకొందరు అందులోనే తమ వైవిద్యాన్ని చాటుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మంచం తయారు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడం గ్యారెంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. డబుల్ కాట్ మంచాన్ని ఎవరైనా చెక్కతో తయారు చేస్తారు. కొందరు ఎక్కువ డబ్బులు వెచ్చించి, మంచి కలపను వినియోగిస్తారు. అయితే ఇదంతా రొటీన్ అనుకున్నాడో ఏమో గానీ.. ఓ వ్యక్తి వినూత్నంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికీ విరిగిపోని మంచాన్ని తయారు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం మంచం ఆకారంలో మార్కింగ్ వేసుకుని, సిమెంట్ వేసి ఇటుకలను పేర్చాడు.

Jugaad Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో దుస్తుల వాషింగ్.. ఇతడి ట్రిక్ చూస్తే షాకవ్వాల్సిందే..


ఇలా డిజైన్ చేసుకున్న విధంగా మొత్తం ఇటుకలను పేర్చి, (man making bed with bricks) సిమెంట్‌తో ప్లాస్టింగ్ వేశాడు. మంచం తల భాగంలో ఆకర్షణీయంగా ఇటుకలతోనే డిజైన్ చేశాడు. తర్వాత మంచానికి రంగులు వేశాడు. ఆ తర్వాత మంచం తల వద్ద వినూత్నమైన డిజైన్లలో అలంకరిస్తాడు. ఆ తర్వాత మంచం మధ్యలో పెద్ద పెద్ద ఇటుకలను పెట్టి, దానిపై చెక్కను పరిచాడు. దానిపై రెండు పరుపులు, దుప్పటి వేసి.. ఫైనల్‌గా అందమైన డబుల్ కాట్ మంచాన్ని సిద్ధం చేశాడు.

Funny Viral Video: సెల్ఫీ స్టిక్‌ పట్టుకున్న సింహం.. షాకైన మిగతా సింహాలు సమీపానికి వెళ్లగా..


ఇలా ఇటుకలతో ఎప్పటికీ విరిగిపోని మంచాన్ని సిద్ధం చేశాడన్నామాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇటుకలతో డబుల్‌ కాట్ మంచం’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 78 వేలకు పైగా లైక్‌లు, 22 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వీధి సందులో నిలబడ్డ యువతి.. సమీపానికి వచ్చిన అంకుల్.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2025 | 08:09 PM