Rose Day 2023: డియర్ లవ్ హేపీ రోజ్ డే ..!
ABN , First Publish Date - 2023-02-07T10:29:28+05:30 IST
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ప్రత్యేకంగా రంగురంగుల గులాబీ సువాసనలతో, మనసు దోచే విధంగా మొదలవుతుంది.
'ఫిబ్రవరి మాసానా.. ఓ వెన్నెల సమయాన'.. అంటూ అతడు అందంగా పాడుకుంటూ లవర్ చేతికి ఆమెకన్నా అందమైన గులాబీని పట్టుకుని రొమాంటిక్ గా వస్తున్నాడు. ప్రియుడిని చూసి సిగ్గుపడుతూ తన చేతిలోని గులాబీని అందంగా అందిస్తుంది ప్రియురాలు.
ఈ ఏడు రోజుల పాటు వాలెంటైన్ వీక్ జరుపుకుంటారు ప్రేమికులు.. మొదటి రోజు రోజ్ డేతో మొదలవుతుంది. మనసుకు నచ్చినవారికి ప్రేమను తెలిపే రోజు.. ప్రేమను మాటలకంటే మౌనంగా రోజాతో చెపితే.. రోజా పువ్వు మీకు వారిమీద ఉన్న అపారమైన ప్రేమను హృదయపూర్వకంగా తెలిపేందుకు సాయం చేస్తుంది. అందుకే ప్రేమికులందరికీ రోజ్ డే శుభాకాంక్షలు.. తెలుపుతూ..హ్యాపీ రోజ్ డే మై డియర్, మన ప్రేమ ఈ గులాబీల వలె వికసించాలని, ఆనందం, ప్రేమతో నిండి ఉంటుందని ఆశిస్తున్నానంటూ ఆమెతో చెప్పేయండి మరి.
2023 సంవత్సరంలో వాలెంటైన్స్ వీక్..! ప్రేమ జంటలు, ప్రేమపక్షుల్లా ప్రేమను పంచుకునేందుకు రోజ్ డేతో వేడుక ప్రారంభమవుతుంది. ఈ వాలెంటైన్స్ వీక్ అందమైన గులాబీలతో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న, ప్రత్యేకంగా రంగురంగుల గులాబీ సువాసనలతో, మనసు దోచే విధంగా మొదలవుతుంది.
విక్టోరియన్లు ప్రియమైన వారికి గులాబీలను ఇచ్చే ఆచారాన్ని మొదలుపెట్టారట. అప్పటి నుండి, ప్రేమికులు ఒకరికొకరు గులాబీలను పంచుకోవడం ద్వారా ప్రేమను పంచుకోవాలని రోజ్ డేని జరుపుకుంటున్నారు. రోజ్ డే రోజున, ప్రేమికులు ఒకరిపై మరొకరు తమ ప్రేమను తెలిపేందుకు గులాబీలను మార్చుకుంటారు.
పీచ్ గులాబీలు ప్రేమ, అమాయకత్వం సూచిస్తాయి, అయితే తెల్లని పువ్వులు స్వచ్ఛతను సూచిస్తాయి. మీరు ఇష్టపడే వారికి రోజ్ ఇవ్వడానికి ఈరోజును కేటాయించారు. ఇంకేందు ఆలస్యం రోజ్ తో రెడీకండి.