Share News

Health Facts: కళ్లజోడు వాడుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమిది.. రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..!

ABN , First Publish Date - 2023-10-31T10:11:00+05:30 IST

ప్రతిరోజూ కేవలం 5నుండి 10నిమిషాల సేపు ఈ కంటి వ్యాయామాలు ఫాలో అయితే చాలు.. కొద్దిరోజుల్లోనే మ్యాజిక్ జరుగుతుంది.

Health Facts: కళ్లజోడు వాడుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమిది.. రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాలలోకి కళ్లు చాలా ముఖ్యమైనవి. కంటి చూపు బాగుండాలంటే కళ్ళను జాగ్రత్తగా కాపాడుతోవాలి. కంటి సంరక్షణా చర్యలు పాటించాలి. కానీ ఇప్పట్లో కళ్ళజోడు లేని మనుషులు కనిపించరంటే అతిశయోక్తి కాదు. గంటల కొద్దీ కంప్యూటర్లు ముందు పనిచేస్తూ ఎక్కువ సేపు మొబైల్ బ్రౌజింగ్, టీవి చూడటం చేస్తుంటే కళ్లు దెబ్బతింటాయి. కంటి చూపు మందగిస్తుంది. వృద్దాప్యంలో కంటి చూపు మందగిస్తే ఉపయోగించాల్సిన కళ్ళజోడును చిన్నపిల్లలు, యువత కూడా వాడుతున్నారంటే దృష్టిలోపం తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కంటి ఆరోగ్యం మెరుగుపడి కంటి చూపు పదునెక్కడానికి యోగాలో కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. ప్రతిరోజూ కేవలం 5నుండి 10నిమిషాల సేపు ఈ వ్యాయామాలు ఫాలో అవుతుంటే కొద్దిరోజుల్లోనే కళ్ళజోడు తీసి పక్కన పెట్టేయచ్చు.

పామింగ్..

పామింగ్ అనేది వ్యాయామం కాదు కానీ కళ్ళకు విశ్రాంతిని చేకూరుస్తుంది. రెండు చేతులను ఒకదానితో మరొకటి బాగా రుద్దితే వెచ్చదనం పుడుతుంది. చేతులను ఇలా రుద్దిన వెంటనే రెండు కళ్ళమీద పెట్టుకోవాలి. చేతులకు ఉన్న వెచ్చదనం కళ్ళలోకి ప్రసరించి కళ్ల చుట్టూ రక్తప్రసరణ మెరుగవుతుంది.

కుడి, ఎడమవైపుకు చూడటం..

కళ్ళను ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలలో ఇది మొదటిది. ఒక చోట స్థిరంగా కూర్చుని కళ్లను కుడి వైపుకు, ఎడమవైపుకు తిప్పుతూండాలి. ఇది గడియారంలో లోలకం లాగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ 3 నుండి 5 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

Viral Video: ఇల్లు శుభ్రం చేస్తోంటే పైకప్పు నుండి వింత శబ్దాలు. అనుమానంగానే చేతులు పెట్టిన యువతికి దొరికిందేంటో చూస్తే..



పైకి కిందకూ చూడటం..

కుడి ఎడమవైపుకు చూసినట్టుగానే పైకి కిందకూ చూస్తూ కంటి వ్యాయామం చెయ్యాలి. అయితే ఈ వ్యాయామంలో పైకి కిందకి చూసేటప్పుడు 5నుండి 10సెకెన్ల గ్యాప్ ఉండాలి. చాలా వేగంగా చెయ్యడం మంచిది కాదు.

కనురెప్పలు వాల్చడం..

కంప్యూటర్, మొబైల్, టీవి ఇలా ఏది చూస్తున్నా చాలా మంది కనురెప్ప వేయడం కూడా మరచిపోతుంటారు. కళ్లు వేగంగా మూస్తూ తెరుస్తూ చేసే వ్యాయామం వల్ల కళ్లు అలసట నుండి బయట పడతాయి. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో ఒక నిమిషం పాటు ఈ వ్యాయామం చేస్తుంటే మంచి నిద్ర పడుతుంది.

సవ్య, అపసవ్య దిశలో తిప్పడం..

కళ్లను వృత్తాకారంగా తిప్పాలి. ఆ తరువాత అదే విధంగా రివర్స్ గా చేయాలి. వృత్తాకారం సవ్యదిశలోనూ, దాన్నే అపసవ్య దిశలోనూ చేయాలి. ఇలా రోజూ కనీసం 10సార్లు అయినా చేయాలి. ఇలా చేస్తుంటే కళ్ళకు బలం చేకూరుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

Viral Video: మార్కెట్ లోకి కొత్తరకం జీన్స్.. నెటిజన్ల శాపాలు మామూలుగా లేవుగా..


Updated Date - 2023-10-31T10:11:00+05:30 IST