Sad Love Story: బిహార్‌లో సీమా హైదర్ లాంటి లవ్‌స్టోరీ.. కానీ క్లైమాక్స్ మాత్రం విషాదాంతం..!
ABN , First Publish Date - 2023-10-20T12:20:52+05:30 IST
బిహార్‌లో సీమా హైదర్ లాంటి లవ్‌స్టోరీ (Seema Haider type Love Story) ఒకటి బయటకు వచ్చింది. కానీ, క్లైమాక్స్ మాత్రం విషాదాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రం దర్భంగాకు చెందిన వికాస్ యాదవ్ వివాహితుడు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో సీమా హైదర్ లాంటి లవ్‌స్టోరీ (Seema Haider type Love Story) ఒకటి బయటకు వచ్చింది. కానీ, క్లైమాక్స్ మాత్రం విషాదాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రం దర్భంగాకు చెందిన వికాస్ యాదవ్ వివాహితుడు. అయితే, పని నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతనికి ఓ ముస్లిం అమ్మాయితో పరిచమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమ (Love) గా మారింది. దాంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే కోర్టులో వివాహం చేసుకున్నారు. ఈ విషయం వికాస్ మొదటి భార్యకు తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
Shocking: సరిగ్గా ఉడకని మష్రూమ్‌లను తిన్నాడో వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..!
ఈ క్రమంలో వికాస్ తన భార్యకు సర్ది చెప్పాలని స్వస్థలం దర్భంగా (Darbhanga) కు తిరిగొచ్చాడు. అక్కడ పెద్దల సమక్షంలో పంచాయితీ (Panchayat) జరిగింది. కానీ, వికాస్ భార్య తాను ఎట్టిపరిస్థితుల్లో తన భర్త ముస్లిం అమ్మాయితో కలిసి ఉండడాన్ని ఒప్పుకొనని తేగేసి చెప్పింది. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చిన తర్వాతే తిరిగి అత్తింట్లో అడుగు పెడతానని పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో వికాస్ తన అత్తగారి ఊరైన లహేరియసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండసరాయ్‌కు వెళ్లాడు. అక్కడ మళ్లీ వారి మధ్య గొడవ జరిగింది. అత్తింట్లో ఉన్న సమయంలోనే కొన్ని రోజుల తర్వాత వికాస్ ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. భర్త అనారోగ్యం బారిన పడడం, ఆస్పత్రిలో చేర్పించిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పింది భార్య.
Viral News: ప్లీజ్ అంటూ వేడుకున్న కస్టమర్.. చెత్త డబ్బాలోంచి ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం తీసి ఇచ్చారంటే..!
అలా ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే వికాస్ ఇటీవల చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చివరికి పోలీసుల వద్దకు చేరింది. దాంతో పోలీసులు వికాస్ మొదటి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టంలో విష ప్రభావంతోనే అతడు చనిపోయినట్లు వచ్చింది. తన భర్త తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని భావించిన భార్య అతని హత్యకు కుట్ర చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తన వద్ద ఉన్నన్ని రోజులు అతడు తినే ఆహారంలో విషం కలిపి ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ విష ప్రభావంతో వికాస్ చనిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఢిల్లీ (Delhi) లో వికాస్ పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి ఇప్పటివరకు పోలీసులకు దొరకలేదట. అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికిపోయి ఉంటుందని? పోలీసులు వెతికే పనిలో ఉన్నారు.