Longer Life: ఎక్కువ కాలం బ్రతకాలని ఉందా..? అయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పనేంటంటే..!
ABN , First Publish Date - 2023-08-17T15:18:29+05:30 IST
ఎక్కువ కాలం బ్రతకాలని అనుకునేవారు మొట్టమొదట చేయవలసిన పని ఒకటుంది. దీన్ని ఫాలో అవ్వడం వల్ల మనిషి జీవితకాలం గణనీయంగా పెరుగుతోందని పరిశోధనల్లో స్పష్టమైంది. అదేంటంటే..
ఎక్కువ కాలం బ్రతకడమంటే ఆరోగ్యం పటిష్టంగా ఉందన్నట్టే లెక్క. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే వారు దీర్ఘాయుష్మాన్ భవా అని దీవించినట్టే ప్రతి ఒక్కరూ ఎక్కువకాలం బ్రతకాలని అనుకుంటారు. అంతలేనిదే యుగాంతం అవుతుందని విన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు గడగడవణికిపోయేవారు కాదు. కానీ మారుతున్న శైలి మనిషి ఆయుష్షును తగ్గిస్తోంది. వందేళ్ళు అంతకు మించి బ్రతికిన వెనుకటి తరంతో పోలిస్తే ఇప్పటి మనిషి సగటు జీవితకాలం అందులో సగమే. కానీ మనిషి ఆశా జీవి, ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటాడు. ఇందుకోసం ఆహారం దగ్గరనుండి జీవనవిధానం వరకు మార్పులు చేసుకోవడానికి నానా యాతన పడుతున్నాడు. ఆరోగ్యనిపుణులు, వైద్యులు చెప్పే ప్రతి విషయాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎక్కువ కాలం బ్రతకాలని అనుకునేవారు మొట్టమొదట చేయవలసిన పని ఒకటుంది. దీన్ని ఫాలో అవ్వడం వల్ల మనిషి జీవితకాలం గణనీయంగా పెరుగుతోందని పరిశోధనల్లో స్పష్టమైంది. అదేంటో.. ఎందుకు ఫాలో కావాలో వివిరంగా తెలుసుకుంటే..
తొందరగా మరణించాలని(Early death) ఎవరికీ ఉండదు. జీవితకాలం పెంచుకోవడానికి వీలైనన్ని మార్గాలు ఫాలో అవుతారు. ఇందుకోసం నడక(walking) చాలా గొప్పగా పనిచేస్తుంది వైద్యులు చెబుతున్నారు.మనిషిలో మరణ రేటుకు, నడకకు మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకోవడానికి చేసిన పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోజూ 1000అడుగులు నడిచేవారిలో 15శాతం మరణ ప్రమాదం తగ్గింది. 4వేల అడుగులు వేసేవారు అన్నిరకాల ఆరోగ్య సమస్యలను చాలా తొందరగా తగ్గించుకోగలరని చెబుతున్నారు. ఇక తమ జీవితకాలాన్ని పెంచుకోవాలంటే ప్రతిరోజు 10వేల అడుగులు వెయ్యాలట. ప్రతిరోజు నడకను తమ జీవితంలో భాగం చేసుకునేవారి గుండె రక్తనాళాలు మూసుకుపోయి మరణం సంభవించే అవకాశం పూర్తీగా తగ్గుతుంది. గుండె నుండి శరీరానికి రక్తం సమర్థవంతంగా పంప్ అవుతుంది.
Sleeping: రాత్రిళ్లు సరిగా నిద్రపోవడం లేదా..? రోజుకు 5 గంటల కంటే తక్కువసేపు పడుకుంటే జరిగేది ఇదే..!
ఇకపోతే ఈ పరిశోధనలు వృద్దుల(Old age people) ఆరోగ్యం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాయి. 60ఏళ్ల(60 years) వయసు కలిగిన వృద్దులను సుమారు 7ఏళ్లపాటు పరిశీలించి మరీ ఈ విషయాలు దృవీకరిస్తున్నారు. రోజుకు సుమారు 6వేల నుండి 10వేల అడుగులు నడవడం వల్ల 60ఏళ్లు పైబడిన వృద్దులలో 42శాతం మరణ ప్రమాదం తగ్గిందని పేర్కొన్నారు. అలాగే రోజుకు 7వేల నుండి 13వేల అడుగులు నడిచిన వారిలో 49శాతం మరణ ప్రమాదం తగ్గింది. కనీసం రోజుకు 4వేల అడుగులు వేసేవారు అర్థాంతర మరణాల నుండి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.