YS Bharathi: వైఎస్ భారతిగా నటించిన ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదా..!

ABN , First Publish Date - 2023-06-24T13:54:52+05:30 IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా మారిపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ‘వ్యూహం’ అనే సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ అదృశ్యంతో మొదలైన ఈ టీజర్ వైఎస్ భారతి, జగన్ షేక్ హ్యాండ్‌తో ముగిసింది. ఈ టీజర్‌లో వైఎస్ భారతి పాత్ర పోషించిన యువ నటి అందరి దృష్టిని ఆకర్షించింది.

YS Bharathi: వైఎస్ భారతిగా నటించిన ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదా..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా మారిపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ‘వ్యూహం’ అనే సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ అదృశ్యంతో మొదలైన ఈ టీజర్ వైఎస్ భారతి, జగన్ షేక్ హ్యాండ్‌తో ముగిసింది. ఈ టీజర్‌లో వైఎస్ భారతి పాత్ర పోషించిన యువ నటి అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం జగన్ సతీమణి భారతి హావభావాలను అచ్చుగుద్దినట్టు దించేసిన ఈ అమ్మాయి ఎవరా అని నెటిజన్లు వెతుకులాట మొదలుపెట్టారు.

RGV1.jpg

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేసిన సందర్భంలోనే రాంగోపాల్ వర్మ ఈ నటి ఎవరనే విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రాం ఐడీ పోస్ట్ చేసి మరీ వెల్లడించాడు. ఈ వర్ధమాన నటి పేరు మానస రాధాకృష్ణన్. స్వతహాగా మలయాళ నటి అయిన ఈ అమ్మాయి ఇప్పటికే తెలుగులో ఒక సినిమా చేసింది.

HighWay.jpg

విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ నటించిన ‘హైవే’ అనే థ్రిల్లర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది.

RGV-Vyuham.jpg

వైఎస్ భారతి పాత్రకు రాంగోపాల్ వర్మ ఈ నటిని ఎంచుకున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి మరీ వైఎస్ భారతి హావభావాలను అనుకరించడంలో మానస రాధాకృష్ణన్ స్వీయ శిక్షణ పొందింది. గంగ ‘చంద్రముఖి’గా మారినట్టుగా వైఎస్ భారతి పాత్రలోకి మానస రాధాకృష్ణన్ పరకాయ ప్రవేశం చేసిందని టీజర్ చూస్తే అర్థమైపోయింది.

Untitled-18.jpg

ఇక.. ‘వ్యూహం’ టీజర్‌లో జగన్, చంద్రబాబు పాత్రల్లో కనిపించిన వాళ్లు గతంలో అవే పాత్రలు పోషించిన వాళ్లే కావడం గమనార్హం. దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పాత్ర చేసిన వ్యక్తి కూడా దాదాపుగా ఆయనలానే ఉన్నారు. ఇటీవల తల్లి వేషాల్లో నటించి మెప్పించిన సురభి ప్రభావతి వైఎస్ విజయమ్మ పాత్రలో కనిపించారు.

Untitled-17.jpg

మొత్తంగా చూసుకుంటే.. వైసీపీ దర్శకత్వ పర్యవేక్షణలో వర్మ ఈ ‘వ్యూహ’ రచన చేసి, తెరకెక్కించాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకుడు రాంగోపాల్ వర్మకు వైసీపీ నుంచి భారీగా ముట్టిందని ఆయన చేస్తున్న ట్వీట్స్, ‘వ్యూహం’ లాంటి సినిమాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వర్మ నుంచి వైసీపీ అనుకూల సినిమాల్లాంటి వీడియోలు రావడం ఖాయమని తేలిపోయింది.

Untitled-11.jpg

అయితే.. వైసీపీకి అనుకూలంగా వర్మ ఎన్ని సినిమాలు తీసినా వాటి వెనుక ఎవరున్నారనే విషయం ఏపీ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘శివ’, ‘రంగీలా’ లాంటి సూపర్ హిట్స్ తెరకెక్కించిన రాంగోపాల్ వర్మలో దర్శకుడు చచ్చిపోయి చాలా కాలమైందని ఆయనను అభిమానించే వారే పెదవి విరుస్తున్న పరిస్థితి.

Updated Date - 2023-06-24T13:58:58+05:30 IST