R.K.Selvamani: ‘అందుకోసం ప్రభుత్వం టిక్కెట్టుకి రూ.1 వసూలు చేయాలి’
ABN , First Publish Date - 2023-02-27T10:20:08+05:30 IST
సినీ నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు వీలుగా చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరూ తాము తీసుకునే రెమ్యునరేషన్‌లో..
సినీ నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు వీలుగా చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరూ తాము తీసుకునే రెమ్యునరేషన్‌లో ఒక శాతం కార్మికుల సహాయ నిధికి సాయం చేయాలని దక్షిణ భారత సినీ నిర్మాణ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి (RK Selvamani) కోరారు. ఇదే విషయంపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక సినిమా నిర్మాణంలో కార్మికలే కీలక పాత్ర. సినిమా షూటింగులో చనిపోతే ఏదో కొంత ఆర్థిక చేస్తున్నారు. మిగిలిన సమయాల్లో ప్రమాదానికి గురైతే వారిని ఆదుకునేందుకు ఎలాంటి నిధులు లేవు. సినీ నిర్మాణ రంగంలోని కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో రూపంలో సాయం చేయాలి. వచ్చే బడ్జెట్‌లో సినీ నిర్మాణ కార్మికులను ఆదుకునేలా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin)ను కోరుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా టిక్కెట్‌లలో ఒక్క రూపాయిని వసూలు చేసి 60 ఏళ్లు పైబడిన కార్మికులకు పింఛను అందించాలి. నగర శివారు ప్రాంతమైన పయ్యనూరులో నిర్మిస్తున్న కలైంజ్ఞర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం స్టాలిన్ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 19న ఏఆర్.రెహ్మాన్ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహిస్తున్నాం. దీనిద్వారా వచ్చే మొత్తాన్ని ‘కార్పస్ ఫండ్’ (Corpus Fund)గా చేసి కార్మికుల సంక్షేమానికి ఉపయోగిస్తాం’ అని సెల్వమణి చెప్పారు.
ఇది కూడా చదవండి: Singam Actor: చిలకలను పెంచుకున్నందుకు.. 2.5 లక్షల జరిమానా..