Couple Viral Video: అందరి మనసూ దోచుకున్నారుగా.. రైల్లో ఈ దంపతులు చేస్తున్న పని చూస్తే..
ABN , Publish Date - Mar 15 , 2025 | 06:59 PM
దంపతులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో దంపతులు చేస్తున్న పని చూసి అంతా భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘డబ్బు లేకుంటేనేం ప్రేమ ఉందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. కొందరు నిత్యం గొడవలు పడుతూనే సంసారం సాగిస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి కష్టాలు మరొకరు పంచుకుంటూ హాయిగా జీవిస్తుంటారు. ఇలాంటి దంపతులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో దంపతులు చేస్తున్న పని చూసి అంతా భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘డబ్బు లేకుంటేనేం ప్రేమ ఉందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్లో ఓ జంట (Couple on the train) కింద కూర్చుని ఉంది. అయితే వారు చేస్తున్న పని చూసి మిగతా ప్రయాణికులంతా అలాగే చూస్తుండిపోయారు. పారిశుధ్య కార్మికుడైన భర్త.. తన భార్య పక్కనే కూర్చుని ఆమె చేస్తున్న పనిలో సాయం చేస్తున్నాడు.
Accident Viral Video: ఒకరి గొడవకు ఇంకొకరు బలవడమంటే ఇదే.. నడుస్తూ వెళ్తున్న యువతి.. చూస్తుండగానే..
కూర చేయడానికి కూరగాయలను సిద్ధం చేస్తున్న భార్యకు తన వంతుగా ఆ భర్త కూడా సహకరిస్తున్నాడు. ఇలా ఆ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరి పనిలో మరొకరు సాయం చేసుకోవడం చూసి ప్రయాణికులంతా ఆసక్తిగా గమనించారు. కొందరు వీరిని వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దంపతులంటే ఇలా ఒకరి కష్టంలో మరొకరు పాలుపంచుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘డబ్బు లేకపోయినా అంతకు మించిన ప్రేమ ఉందిగా’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ దంపతులను అంతా ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..