Accident Viral Video: ఒకరి గొడవకు ఇంకొకరు బలవడమంటే ఇదే.. నడుస్తూ వెళ్తున్న యువతి.. చూస్తుండగానే..
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:17 PM
కొన్నిసార్లు మన తప్పు లేకున్నా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. మరికొన్నిసార్లు ఇంకొకరి గొడవ మన ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా, ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంద. చివరకు ఏమైందో చూడండి..

కొన్నిసార్లు మన తప్పు లేకున్నా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. మరికొన్నిసార్లు ఇంకొకరి గొడవ మన ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి కూడా వస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఒకరి గొడవకు ఇంకొకరు బలవడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కర్ణాటక మంగళూరు (Karnataka, Mangalore) పరిధి బెజై కాపికాడ్‌లోని సహవి మెయిన్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టి.. నేరుగా వచ్చి యువతిని కూడా ఢీకొంది. కారు బలంగా ఢీకొనడంతో (car hit young woman) యువతి గాల్లోకి ఎగిరి అక్కడే ప్రహారీపై ఉన్న ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. కాలు కంచెలో ఇరుక్కుపోవడంతో తలకిందకులుగా వేలాడుతూ కేకలు పెట్టింది. అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకుని, కిందకు దింపుతారు. తర్వాత ఆమెకు గుడ్డతో కట్లు కట్టి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అసలు విషయం ఏంటంటే..
పోలీసుల కథనం మేరకు.. మంగళూరు బెజై ప్రాంతానికి చెందిన ఒక రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి కెఎం సతీష్ కుమార్‌కు.. మురళీ ప్రసాద్ అనే వ్యక్తి మధ్య రెండేళ్లుగా గొడవలు జరుగుతన్నాయి. దీంతో మురళీప్రసాద్‌పై సతీష్ కుమార్ పగ పెంచుకున్నాడు. ఎలాగైనా మురళీ ప్రసాద్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అదును కోసం ఎదురుచూస్తున్న క్రమంలో.. గురువారం మురళీ ప్రసాద్ బైకులో వెళ్తుండడం చూసి సతీష్ తన కారుతో ఢీకొట్టాడు. అయితే అదే సమయంలో ఎదురుగా వస్తున్న యువతిని కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువతితో పాటూ మురళీ ప్రసాద్ కూడా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
Dogs Viral Video: కుక్కలకు మానవత్వం కూడా ఎక్కువే.. యువతి కిండపడడం చూసి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎవరో చేసిన తప్పునకు పాపం యువతి బలైందిగా’’.. అంటూ కొందరు, ‘‘కారు యజమానికి కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికి 5 వేల మందికి పైగా వీక్షించారు.
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..