Share News

Viral: స్విగ్గీలో ఆర్డరిస్తే క్యాన్సిల్ అయ్యింది.. ఆ తరువాత ఆరుగురు డెలివరీ బాయ్స్ ప్రత్యక్షం కావడంతో..

ABN , Publish Date - Dec 15 , 2023 | 07:24 PM

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో పచారీ సామాన్లు ఆర్డరిస్తే క్యాన్సిల్ అయ్యింది. ఆ తరువాత అదే పచారీ సామాన్లతో ఏకంగా ఆరుగురు డెలివరీ ఏజెంట్లు ఇంటి ముందు ప్రత్యక్షం కావడంతో ఓ కస్టమర్ ఆశ్చర్యపోయారు. నెట్టింట ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral: స్విగ్గీలో ఆర్డరిస్తే క్యాన్సిల్ అయ్యింది.. ఆ తరువాత ఆరుగురు డెలివరీ బాయ్స్ ప్రత్యక్షం కావడంతో..

ఇంటర్న్‌ట్ డెస్క్: ఇడ్లీ, బిర్యానీ మొదలు పచారీ సమాన్ల వరకూ ఇప్పుడు ఏదైనా మొబైల్ ద్వారా ఆర్డర్ చేయచ్చు. ఇలా ఆర్డరిచ్చే క్రమంలో ఒక్కోసారి జరిగే ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. స్వి్గ్గీ ఇన్‌స్టామార్ట్‌లో దోశ పిండి, పాలు ఆర్డరివ్వబోతే క్యాన్సిల్ అయ్యింది. ఆ తరువాత ఏకంగా ఆరుగురు డెలివరీ ఏజెంట్లు చేతిలో ఆర్డర్స్‌తో ప్రత్యక్షం కావడంతో అతడికి దిమ్మతిరిగినంత పనైంది. ఆ కస్టమర్ నెట్టింట్లో ఈ ఉదంతాన్ని పంచుకోవడంతో ఇది ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

YouTube Ads: యూజర్లలో మార్పును గమనించిన యూట్యూబ్.. యాడ్స్ విషయంలో కీలక చర్యలు!

Shocking: 37 ఏళ్ల వయసులో కడుపు ఉబ్బెత్తుగా మారడంతో డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. టెస్టులు చేసి చూస్తే..


ప్రణయ్ అనే కస్టమర్ తొలుత స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో (Swiggy Instamart) పాలు, పళ్లు, దోశ పిండి ఆర్డరిచ్చాడు. డబ్బు చెల్లించే క్రమంలో అకస్మాత్తుగా ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టు కనిపించింది. కానీ అతడి అకౌంట్లోంచి మాత్రం డబ్బులు కట్ అయ్యాయి. ఆ తరువాత మరో రెండు మూడు సార్లు ట్రై చేసినా ఆర్డర్ పెట్టడం మాత్రం కుదరలేదు. ప్రతిసారీ క్యాన్సిల్ అయినట్టు నోటిఫికేషన్ వచ్చింది. దీంతో, అతడికి ఏం చేయాలో పాలుబోలేదు.

Mustard Oil: మనం ఇష్టంగా తినే ఆవనూనె..ఒకేఒక్క కారణంతో అమెరికాలో నిషేధం.. ఆవనూనెతో ఇంతటి ప్రమాదమా?


ఇంతలో అతడికి ఏకంగా ఆరుగురు డెలివరీ ఏజెంట్లు కాల్ చేశారు (man receives same order 6 times). సరుకులు తెస్తున్నామంటూ సమాచారం ఇచ్చారు. ఆ తరువాత కాసేపటికి వారంతా అతడి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. అంతకుమునుపు క్యాన్సిల్ అయిన ఆర్డర్‌లోని వస్తువులే వారూ తేవడంతో అతడు దిమ్మెరపోవాల్సి వచ్చింది. ఇలా అందరూ అవే వస్తువులు తేవడంతో చివరకు అతడి ఇంటికి 20 లీటర్ల పాలు, 6 కిలోల దోశ పిండి, ఆరు ప్యాకెట్ల పైనాపిల్స్ వచ్చాయి. ఇది చూసి ఆశ్చర్యపోయిన అతడు జరిగింది నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఘటనపై స్పందించిన స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్.. అసలేం జరిగిందో తెలుసుకుందామంటూ ప్రణయ్‌కు సమాచారం అందించింది.

Viral video: ఇదేందయ్యా..ఇదీ..పెళ్లైన మరుక్షణమే ఈ నవదంపతులు ఊహించని విధంగా..

Updated Date - Dec 15 , 2023 | 07:30 PM