valentine week 2023: ఒక్క ప్రామిస్‌తో మనసులో ప్రేమను తెలియజేయండిలా..!
ABN , First Publish Date - 2023-02-11T18:10:52+05:30 IST
ప్రతి వాగ్దానం వ్యక్తుల పట్ల ఎంత శ్రద్ధ , ప్రేమను చూపుతున్నారో తెలుపుతాయి.
వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 11న ప్రామిస్ డే జరుపుకుంటారు. మీ ప్రియమైన వారికి వాగ్దానాలు చేయడానికి సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది ఒక రోజు. వాలెంటైన్స్ వారంలో ఐదవ రోజున ప్రామిస్ డే వస్తుంది. ఇది ప్రేమజంటలు ఒకరికొకరు వాగ్దానాలు చేసుకునే రోజు,. ఈ వాగ్దానాలు ఒకరికొకరు వారి ప్రేమ, నిబద్ధతతో వారి బంధాన్ని, బలాన్ని చూపుతాయి. ప్రేమించడం ఎంత ముఖ్యమో, ఆ బంధాన్ని నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా కలిసి నడవాలంటే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం తప్పక ఉండాలి. ఇలాంటి ఒకరోజు ఉండటం వల్ల ఒకరిని ఒకరు అర్థం చేసుకునే వీలుంటుంది. మనసులు పరిచి మాట్లాడుకునే అవకాశం కూడా కలుగుతుంది. ప్రేమలోకంలో విహరించే ప్రేమికులందరికీ ప్రామిస్ డే వారి ప్రేమను రెట్టింపు చేసుకునే వీలును కల్పిస్తుంది. ఇక పార్టీలు, సరదాలు, విహార యాత్రలూ ఈ వారం అంతా ఉండనే ఉంటాయి. వాటితో పాటు ఈ సరదా డేస్ కూడా ప్రేమను పెంచడంలో సహాయపడతాయి. ఇంకెందుకు ఆలస్యం మీ ప్రియమైన వారికి వాగ్దానం చేసి మీ ప్రేమను రెట్టింపు చేయండిక.
ప్రామిస్ డే 2023:
ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు, భాగస్వామి చేసిన వాగ్దానాలు వారికి చాలా ముఖ్యమైనవి. తనకు నచ్చిన వస్తువు ఇవ్వడం, వస్తానన్న చోటుకి రావడం, కలిసి మాట్లాడుకోవడం ఇవన్నీ, ప్రతి వాగ్దానం మీరు మీ జీవితంలో ముఖ్యమైన ఇతర వ్యక్తుల పట్ల ఎంత శ్రద్ధ , ప్రేమను చూపుతున్నారో తెలుపుతాయి.. వాస్తవానికి, ప్రామిస్ డే అనేది జంటలు ఎలాంటి పరిస్థితులలోనైనా ఒకరికొకరు అండగా ఉంటామని, వారు ఒకరినొకరు బేషరతుగా ప్రేమిస్తారని, ఆదరిస్తారని నమ్మకాన్ని పంచుతూ, దృఢమైన వాగ్దానం చేయడానికి ఒక అవకాశం.