Viral News: వరుడి చెప్పులు దాచి రూ.50 వేలు డిమాండ్..చివరకు దాడి, ఇది కరెక్టేనా..
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:32 PM
అప్పుడప్పుడు పెళ్లిళ్ల వేడుకల్లో భాగంగా చిత్ర, విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. వరుడికి దండ వేసే సమయం, అక్షింతల కార్యక్రమం, డాన్స్ పోటీల వంటివి చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం తాజాగా ఓ వినూత్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివాహాల సమయాల్లో సరదా, హాస్యం, అల్లరి వంటివి అనేకం జరుగుతాయి. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలో ఓ పెళ్లిలో జరిగిన సంఘటన మాత్రం అంతకు మించి ఉందని చెప్పవచ్చు. ఈ ప్రాంతాల్లో సాధారణంగా వరుడి చెప్పులను వధువు కుటుంబ సభ్యులు దొంగిలించే సంప్రదాయం ఉంది. ఆ క్రమంలో దానికి బదులుగా వరుడు వారికి నచ్చిన నగదు మొత్తాన్ని ఇచ్చి చెప్పులను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తాజాగా దాచిన చెప్పులను తిరిగి ఇచ్చేందుకు వారు రూ. 50,000 డిమాండ్ చేశారు. కానీ వరుడు మాత్రం అందుకు ఒప్పుకొలేదు. వాళ్లు కూడా ఏ మత్రం వెనక్కి తగ్గలేదు.
ఇరు వర్గాల మధ్య వివాదం..
ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాదన జరిగి వరుడిని బిచ్చగాడని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వరుడి కుటుంబం కూడా మీరు మాకు కట్నం రూపంలో బంగారం ఇచ్చారని, అది చాలా తేలికగా ఉందన్నారు. రుద్దడం వల్ల అది విరిగిపోతుందన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత పెరిగింది. ఆ క్రమంలో వధువు వైపు నుంచి వచ్చిన వ్యక్తులు అతన్ని ఒక గదిలో బంధించి, దాడి చేశారు. ఆ క్రమంలో వరుడి తండ్రి, కొంతమంది బంధువులను కూడా బందీలుగా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.
చివరకు పోలీస్ స్టేషన్
ఈ వివాదం మరింత పెరగడంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. తర్వాత వచ్చిన పోలీసులు గాయపడిన వరుడితోపాటు వధువు బంధువులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ వరుడు పెళ్లి కుమార్తె ఫ్యామిలీపై ఫిర్యాదు చేశాడు. చెప్పులు దొంగిలించే ఆచారంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని వెల్లడించాడు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న పోలీసులు వారిని చివరకు శాంతింపజేసి ఇంటికి పంపించారు.
నెటిజన్ల కామెంట్స్
ఈ సంఘటన గురించి తెలిసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సంప్రదాయం పేరుతో అనేక మంది హద్దులు మీరుతున్నారని అంటున్నారు. వాటికి కూడా ఒక పరిధి ఉంటుందని చెబుతున్నారు. ఆచారం, సంప్రదాయం పేరుతో ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. సంతోషంగా చేసుకునే వేడుకల్లో ఇలా దిగజారి ప్రవర్తించడం ఇరు వర్గాలకు కూడా మంచిది కాదన అంటున్నారు నెటిజన్లు.
ఇవి కూడా చదవండి:
Stock Market: అసలు స్టాక్ మార్కెట్ నష్టాలు ఎందుకు..కారణాలు ఇవే...
Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్..నిమిషాల్లోనే లక్షల కోట్ల నష్టం
YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News