Vani Jayaram: ఐదు సార్లు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం డోర్ తీయకపోవడంతో పని మనిషి ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2023-02-04T18:36:23+05:30 IST
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (Vani Jayaram Suspected Death) ఆమె నివాసంలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా పడి ఉండటం భారతీయ చలనచిత్ర పరిశ్రమను..
చెన్నై: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (Vani Jayaram Suspected Death) ఆమె నివాసంలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా పడి ఉండటం భారతీయ చలనచిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. చెన్నైలోని నుంగంబాక్కమ్ (Nungambakkam) ప్రాంతంలోని డౌన్‌టౌన్ అపార్ట్‌మెంట్స్‌లోని (Downtown Apartments) ఫ్లాట్‌లో వాణీ జయరాం నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లో శనివారం నాడు ఆమె చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై (Chennai) నగరం ఉలిక్కిపడింది. ఉదయమే ఆమె చనిపోయి ఉండొచ్చని, ఇంట్లో ఒక్కరే ఉండటంతో ఆమె చనిపోయిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆమె ఉంటున్న ఇంటిని పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ టీం (Forensics team) కూడా వాణీ జయరాం ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో ఉంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తోనే వాణీ జయరాం మృతికి కారణం ఏంటనే విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వాణీ జయరాం ఇంట్లో పనిచేసే ఆమె పనిమనిషి మలర్‌కొడి శనివారం ఉదయం 10.30 గంటలకు వాణీ జయరాం ఇంటికి రోజూలానే వెళ్లింది. డోర్ కొట్టింది. ఐదు సార్లు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపు తీయలేదని చెప్పింది. తన భర్త కూడా వాణీ జయరాంకు కాల్ చేశాడని, అయినా ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదని మీడియాకు వెల్లడించింది. వాణీ జయరాం ఒక్కరే ఆ ఇంట్లో ఉంటున్నారని ఆమె ఇంట్లో పనిచేస్తున్న మలర్‌కొడి తెలిపింది.
పనిమనిషి మలర్‌కొడి ఇంకా ఏం చెప్పిందంటే..
* వాణీజయరామ్ నుదురు, ముఖంపై గాయాలు ఉన్నాయి: పనిమనిషి
* పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలించిన పనిమనిషి
* ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ప్రాణాలు కోల్పోయిందన్న వైద్యులు
* అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు
* వాణీజయరామ్ ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు
* సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్న చెన్నై పోలీసులు
వాణీ జయరాం సింగింగ్ కెరీర్ గురించి విశేషాలివి..
* వాణీజయరామ్ అసలు పేరు కలైవాణి
* వివిధ భాషల్లో 20 వేలకుపైగా పాటలు పాడిన వాణీజయరామ్
* ఇటీవల వాణీజయరామ్కు పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం
* 1971లో నేపథ్య గాయనిగా వాణీజయరామ్ సినీరంగ ప్రవేశం
* 3 సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్న వాణి
* కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో నైపుణ్యం
* 8వ ఏటనే ఆలిండియా రేడియోలో ప్రదర్శనలు
* 19 భాషాల్లో పాటలు పాడిన వాణీజయరామ్
* ‘బోలే రే పపీ హరా’ పాటతో నేపథ్య గాయకురాలిగా ప్రవేశం
* హిందీ సినిమా 'గుడ్డి' ద్వారా సినీరంగంలోకి ప్రవేశం
* పలు భాషల్లో భక్తీ గీతాలు ఆలపించిన వాణిజయరామ్