Viral News: రాత్రి సమయం ప్రియురాలి ఇంట్లో దూరి ఓ ప్రియుడి నిర్వాకం.. అతడిమీద కోపంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే జరిగిందిదీ..
ABN , First Publish Date - 2023-05-10T19:20:07+05:30 IST
రాత్రి సమయంలో ఇంట్లో దూరి తన బాయ్ ఫ్రెండ్ చేసిన పనికి ఆ అమ్మాయికి కోపం వచ్చింది. ఆమె నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత జరిగిన సంఘటన..
ఇప్పటికాలంలో ప్రేమికులు ఒకరిమీద మరొకరు రివేంజ్ తీర్చుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఓ కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయి విషయంలో ఇలాగే చేశాడు. రాత్రి సమయంలో అమ్మాయి ఇంట్లోకి దూరి, నిద్రపోతున్న అమ్మాయి జుట్టు కత్తిరించాడు. ఆ తరువాత అమ్మాయి ఇంట్లో టీవీ, కంప్యూటర్, కారు వగైరా వస్తువులన్నీ ధ్వంసం చేశాడు. అతనికి బుద్ది చెప్పాలనుకున్న అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు కేసు విచారించి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు విన్నవారంతా షాకయ్యారు. ముఖ్యంగా ఆ కుర్రాడు కోర్టు బయటకు రాగానే అమ్మాయి ముందే డ్యాన్స్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్(England) లోని నార్తాంప్టన్( Northamptom)లో ఓవెన్ జేమ్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఓ అమ్మాయిని ప్రేమించాడు.ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమించింది. వారిద్దరూ గత మూడేళ్ళనుండి రిలేషన్(relation from 3years) లో ఉన్నారు. అయితే జేమ్స్ ప్రేమించిన అమ్మాయి అతన్ని మోసం చేసింది(girlfriend cheating). దీంతో జేమ్స్ కు ఆ అమ్మాయి మీద పీకలదాకా కోపం వచ్చింది. ఆ కోపం లోనే రాత్రి సమయంలో ఆ అమ్మాయి ఇంట్లోకి దూరాడు. ఆమె గదిలోకి వెళ్ళి నిద్రిస్తున్న ఆమె జుట్టు కత్తిరించాడు(cut girl friend hair). ఆ తరువాత ఇంట్లో ఉన్న టీవీ,కంప్యూటర్, కార్ వంటివన్నీ ధ్వంసం చేశాడు. ఇంట్లో వస్తువులు పగులుతున్న శబ్దానికి ఆ అమ్మాయికి మెలకువ వచ్చింది. ఆమె అతన్ని ఆపాలని ప్రయత్నించినా ఆతను తన విధ్వంసం ఆపలేదు. చివరికి ఆ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి జేమ్స్ ను అరెస్ట్ చేశారు.
Bride: పెళ్ళిరోజు బ్యూటీపార్లర్ కు వెళ్ళి ఎంతసేపైనా తిరిగిరాని వధువు.. కంగారుతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తే..
అమ్మాయి ఫిర్యాదును అనుసరించి కోర్టువారు కేసు విచారణ చేశారు. తదనంతరం కోర్టు తీర్పు(court judgment) వెలిబుచ్చింది. కోర్టు తీర్పులో జేమ్స్ కు కఠినమైన శిక్ష పడుతుందని ఆ అమ్మాయి అనుకుంది. కానీ కోర్టు వారు మాత్రం జేమ్స్ ను అసలు జైలుకు వెళ్లాల్సిన అవసరమే లేదని తీర్పు ఇచ్చారు. అతనికి 12నెలల పాటు స్టే విధించారు. అమ్మాయికి 25వేల డాలర్లు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. పరిహారం చెల్లించాల్సి వచ్చినా జేమ్స్ మాత్రం బాధపడలేదు. అతని ప్రియురాలు మోసం చేసిందనే కోపంతోనే అతను అలా చేయాల్సివచ్చిందని అతని న్యాయవాదులు గట్టిగా వాదించడంతో కోర్టు తీర్పు ఆమె ఆశించినట్టు రాలేదు.