Kalatapasvi Viswanath: ఇప్పటి దర్శకులు నేర్చుకోవలసినవి చాలా వున్నాయి
ABN , First Publish Date - 2023-02-03T15:14:35+05:30 IST
కళాతపస్వి విశ్వనాధ్ (Kalatapasvi Viswanath) గారి సినిమాల్లో కొన్ని పాత్రలు సజీవంగా ఉంటాయి. 'సాగర సంగమం' (Sagara Sangamam) సినిమాలో సాక్షి రంగారావు పాత్ర తీసుకోండి ప్రతి దానికీ గాబరా పడుతూ ఉంటాడు. అలనాటి పాత్రలని విశ్వనాధ్ #RIPVishwanathGaru గారి సినిమాల్లో చాలా చూస్తాం.
కళాతపస్వి విశ్వనాధ్ (Kalatapasvi Viswanath) గారి సినిమాల్లో కొన్ని పాత్రలు సజీవంగా ఉంటాయి. 'సాగర సంగమం' (Sagara Sangamam) సినిమాలో సాక్షి రంగారావు పాత్ర తీసుకోండి ప్రతి దానికీ గాబరా పడుతూ ఉంటాడు. అలనాటి పాత్రలని విశ్వనాధ్ #RIPVishwanathGaru గారి సినిమాల్లో చాలా చూస్తాం. అలాగే 'శంకరాభరణం' (Shankarabharanam) లో మామ్మగారి పాత్ర కూడాను. ఇవే కాదు అతని సినిమాలో చాలా పాత్రలు సజీవంగా ఉంటాయి. ఆ ఆలోచనలు విశ్వనాధ్ గారికి ఎలా వస్తాయని ఆయనని అడిగితే అతను చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా వుండి, అది ఇప్పుడు దర్శకులు చాలా ఉపయోగం కూడాను.
"నా సినిమాలో చాలా పాత్రలు నిజ జీవింతంలో నాకు తారసపడే వాళ్ళని, నేను చూసిన వాళ్ల నుంచి స్ఫూర్తి పొంది తీసుకుంటాను. మన చుట్టూ ఎంతోమంది వుంటారు, కొంతమంది జీవితంలో కొన్ని విషయాలకి పోరాటం చేస్తూ వుంటారు, కష్ట పడుతూ వుంటారు. ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి కూడా. ఒక దర్శకుడు కానీ, ఆర్టిస్టు కానీ లేదా ఒక క్రియేటివ్ పర్సన్ ఎప్పుడూ తన చుట్టూ ఏమి జరుగుతోందో అబ్సర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళను, చుట్టాలను, లేదా సమాజంలో ఏమి జరుగుతోందో చూసి వాళ్ళనుంచి స్ఫూర్తి, లేదా ప్రేరణతో సినిమాలో కథలు, క్యారెక్టర్ లు రాయొచ్చు," అని చెప్పారు #RIPVishwanathGaru విశ్వనాధ్.
అందుకేనేమో అయన సినిమాల్లో పాత్రలు మన చుట్టూ, మన ఇంట్లో జరుగుతున్నట్టు ఉంటాయి. విశ్వనాధ్ #RIPVishwanathGaru గారు ఎప్పుడూ సినిమా పాత కోసం, లేదా సీన్ కోసం విదేశాలకు వెళ్లి షూటింగ్ చెయ్యలేదు. (Viswanath) చాలా సినిమాలు ఇక్కడ భారతదేశం, గోదావరి, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ తీశారు. ఇప్పటి దర్శకుడు కథ రాయడానికి ఎక్కడికో వెళ్ళాలి, బీచ్ ఉండాలి లేదా ఇంకేదో ఉండాలి. కానీ నీ చుట్టుపక్కల నువ్వు పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లి నీ కథ రాస్తే చాల సినిమాలు కూడా అందుకే అంత కృత్రిమంగా ఉంటున్నాయి ఇప్పుడు. (Shankarabharanam)
--సురేష్ కవిరాయని