Washing Machine Blast: సడన్‌గా బ్లాస్ట్ అయిపోయిన వాషింగ్ మెషీన్.. మంటలు చెలరేగి బీభత్సం.. దుస్తులను వేసి ఆన్ చేసిన కొద్ది నిమిషాలకే
ABN , First Publish Date - 2023-04-05T19:47:28+05:30 IST
కుక్కర్ బ్లాస్ట్(Pressure cooker blast) అయ్యిందని, మొబైల్ ఫోన్ బ్లాస్ట్(Mobile phone blast) అయ్యిందని వింటూ ఉంటాం. కానీ వాషింగ్ మెషీన్ బ్లాస్ట్(Washing machine blast) అవ్వడం
సాధారణంగా కుక్కర్ బ్లాస్ట్(Pressure cooker blast) అయ్యిందని, మొబైల్ ఫోన్ బ్లాస్ట్(Mobile phone blast) అయ్యిందని వింటూ ఉంటాం. కానీ వాషింగ్ మెషీన్ బ్లాస్ట్(Washing machine blast) అవ్వడం ఎప్పుడైనా చూశారా? కనీసం వాషింగ్ మెషిన్ బ్లాస్ట్ అవుతుందని తెలుసా? మీరెప్పుడూ వాషింగ్ మెషిన్ బ్లాస్ట్ అవ్వడం చూడకపోతే ఇదిగో ఇక్కడ చూడచ్చు. ఎప్పటిలా విడిచిన బట్టలు వాష్ చేద్దామని వాషింగ్ మెషీన్ లో బట్టలు వేశాడు ఒక వ్యక్తి. అయితే బట్టలు వాషింగ్ మెషీన్ లో వేసిన కొద్ది నిమిషాలకే బ్లాస్ట్ అయ్యింది. వాషింగ్ మెషీన్ నుండి అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. దుస్తుల పాకెట్ లో ఉంచేసిన ఒకే ఒక్క వస్తువు వల్ల అంత భారీ పేలుడు సంభవించిందట. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బెంబేలు పడిపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..
ప్రస్తుత కాలంలో బట్టలు ఉతుక్కోవడానికి(Clothes washing) చాలా ఇళ్ళలో వాషింగ్ మెషిన్ లు ఉంటున్నాయి. ఇక ఫారిన్లలో అయితే ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ఓ వ్యక్తి విడిచిన బట్టలన్నీ తెచ్చి వాషింగ్ మెషీన్ లో వేశాడు. అది ఆటోమెటిక్ వాషింగ్ మెషిన్(Automatic Washing machine) కావడంతో బట్టలు వాష్ అయ్యాక అదే ఆప్ అవుతుంది. ఆలోపు ఇతర పనులు చూసుకోవచ్చని అతను బయటకు(outing) వెళ్ళాడు. అతను అలా బయటకు వెళ్ళిన కొన్ని సెకన్లకే ఆ వాషింగ్ మెషీన్ బ్లాస్ట్ అయ్యింది. ఆ పేలుడు దాటికి వాషింగ్ మెషిన్ నుండి అగ్నికీలలు(flames) ఒక్కసారిగా బయటకు చొచ్చుకొచ్చాయి. వాటి దెబ్బకు ఆ ఇంటి అద్దాలన్నీ పగిలిపోయాయి(blast the wall glasses).
ఆ ఇంటివారు బట్టలు వాషింగ్ మెషీన్ లో వేసేటప్పుడు దుస్తుల పాకెట్(Clothes pockets) లు చెక్ చేయకపోవడం వల్లే అలా జరిగిందని, దుస్తులలో సిగరెట్ లైటర్(Cigarette lighter) ఉండిపోయిందని సంఘటనను పరిశీలించిన అధికారులు చెప్పారు. ఎవరైనా బట్టలు వాషింగ్ మెషీన్ లో వేసేటప్పుడు పాకెట్ లు అన్నీ చెక్ చేయాలని సూచించారు. ఈ వీడియో OnlyBangers అనే ట్విట్టర్ అకౌంట్(Twitter Account) నుండి షేర్ చేయబడింది. వీడియోలో ఉన్న లొకేషన్ ను బట్టి ఇది విదేశాల్లో జరిగిందని అర్థమవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బెంబేలుపడిపోతున్నారు. 'ఓరి నాయనో ఆ వ్యక్తి ముందే బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అతని ప్రాణాలు పోయేవే' అంటున్నారు. 'అతని అదృష్టం బాగుంది అందుకే బయటపడ్డాడు' అని మరికొందరు కామెంట్స్ చేశారు. 'దయచేసి వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసేటప్పుడు బాగా చెక్ చేసి వేయండి' అని సలహాలు ఇస్తున్నారు.