Keyboard: కీబోర్డ్‌లో స్పేస్ బటన్ ఒక్కటే అన్నిటికంటే పెద్దగా ఉండటం వెనుక.. ఇంత కథ ఉందన్నమాట..!

ABN , First Publish Date - 2023-08-22T16:00:15+05:30 IST

రాసేటప్పుడు పదాల మధ్య గ్యాప్ ఉండటం తప్పనిసరి. అంటే. కీబోర్డుల్లో అత్యధికంగా వాడే కీలల్లో స్పేస్ బార్ ప్రధానమైనది. కాబట్టి, దీనిని రెండు బొటనవేళ్లకు అందేందుకు వీలుగా కీబోర్డు చివరి వరుసలో మధ్య ఏర్పాటు చేశారు. దీంతో, రెండు చేతులతోనూ దీన్ని ప్రెస్ చేస్తూ వేగంగా టైప్ చేయచ్చని నిపుణులు చెబుతున్నారు.

Keyboard: కీబోర్డ్‌లో స్పేస్ బటన్ ఒక్కటే అన్నిటికంటే పెద్దగా ఉండటం వెనుక.. ఇంత కథ ఉందన్నమాట..!

ఇంటర్నెట్ డెస్క్: కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వాడే వారెవరికైనా కీబోర్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిల్లో ఏది టైప్ చేయాలన్నా కీబోర్డు తప్పనిసరి. మనకు ఎన్నో రకాల కీబోర్డులు కనిపిస్తుంటాయి. కానీ ఈ లేఅవుట్ల(Keyboard Layout) వెనుకున్న కారణం ఏమిటీ అనేది చాలా మందికి తెలియదు. అంతేకాదు.. మిగతా అన్ని కీలకంటే స్పేస్ బార్ పెద్దగా కనిపించినప్పటికీ దాని గురించి అసలేమాత్రం పట్టించుకోం. మనకెందులే అన్నట్టు ఉండిపోతాం. రోజూవారీ పనుల్లో మునిగిపోతాం. కానీ, స్పేస్‌బార్ పెద్దగా ఉండటం వెనుక శాస్త్రీయపరమైన కారణాలే(Why is spacebar bigger than other key board keys) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఏ భాషలోనైనా వరుసగా ఉండే రెండు పదాల మధ్య ఎడం తప్పనిసరి. ఆ ఎడాన్ని పెట్టేందుకు మనం స్పేస్‌బార్ వాడతాం. అంటే, అత్యంత ఎక్కువగా వాడే కీలల్లో స్పేస్ బార్ కూడా ఒకటన్నమాట. అంతేకాదు, టైపింగ్ వేగంగా సాగాలంటే స్పేస్‌బార్ అమరిక అందుకు అనుగుణంగా ఉండాలి. ఇందుకోసం, బొటన వేలుతో తాకగలిగేలా స్పేస్‌బార్ అందుబాటులో ఉండాలి. రెండు బోటన వేళ్లతోనూ టైప్ చేయగలిగేలా ఏర్పాటు చేయాలి. అప్పుడే వేగంగా టైప్ చేయడం సాధ్యమవుతుంది. టైప్ రైటర్లపై కొన్నేళ్ల పాటు జరిగిన అధ్యయనం తరువాత ఈ స్పేస్ బార్‌ను రెండు బొటవేళ్లకు అందేలా కీబోర్డు చివరన ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి నిపుణులు వచ్చారు. దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్.


అయితే ప్రామాణిక కీబోర్డులతో పాటూ టైపింగ్ స్పీడు మరింతగా పెంచే ఇతర డిజైన్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటి మధ్య ఉన్న ఓకే ఒక సారూప్యత స్పేస్ బార్. అన్ని మోడళ్ల కీబోర్డులలోనూ ఈ స్పేస్ బార్ కీబోర్డు చివరనే ఉంటుంది. అంతేకాదు, రెండు బొటనవేళ్లకు అందేందుకు వీలుగా కీబోర్డు చివరి వరుసలో మధ్యన దీన్ని ఏర్పాటు చేస్తారు. సో..అదండీ.. స్పేస్ బార్ వెనుకున్న కథ! ఇకపై స్పేస్ బార్ గురించి ఎవరైనా అడిగితే ఈ కథంతా చెప్పేసేయండి.

Updated Date - 2023-08-22T16:06:59+05:30 IST