Viral Video: ఏం వాడుకుంటున్నార్రా... రైలు బోగీలో ఏముందో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Apr 09 , 2025 | 07:32 AM
రైళ్లలో కొందరు కుక్కలు, కోళ్లు, చిలుకలు తదితర జంతువులను తీసుకుని ప్రయాణించడం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి రైల్లో తీసుకెళ్లిన వస్తువు చూసి అంతా అవాక్కవుతున్నారు. బోగీలోకి ఎక్కిన ప్రయాణికులకు తలుపు వద్ద షాకింగ్ సీన్ కనిపించింది.

రైలు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ కొందరు, సీటు కోసం విచిత్ర విన్యాసాలు చేస్తూ మరికొందరు, రన్నింగ్ రైళ్లను ఎక్కి దిగుతూ ఇంకొందరు.. అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, రైల్లో చోటు చేసుకున్న విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. రైలు బోగీలో దృశ్యాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఏం వాడుకుంటున్నార్రా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైళ్లలో కొందరు కుక్కలు, కోళ్లు, చిలుకలు తదితర జంతువులను తీసుకుని ప్రయాణించడం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి రైల్లో తీసుకెళ్లిన వస్తువు చూసి అంతా అవాక్కవుతున్నారు. బోగీలోకి ఎక్కిన ప్రయాణికులకు తలుపు వద్ద షాకింగ్ సీన్ కనిపించింది.
Deer Funny Video: జింకే కదా అని సెల్ఫీ దిగింది.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతింది..
ఓ వ్యక్తి తన స్కూటీని తనతో పాటూ రైలు ఎక్కించాడు. డోరు పక్కనే పార్క్ చేసి తాపీగా తన సీట్లో కూర్చున్నాడు. స్కూటీకి ఓ వైపు బ్యాగు కూడా తగిలించాడు. తన స్టాప్ రాగానే ఎంచక్కా స్కూటీని కిందకు దించి రయ్యిన దూసుకెళ్లాడన్నమాట. అయితే బైకులు తరలించాలంటే.. లగేజీ చార్జీలు కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యక్తి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఇలా నేరుగా తన వాహనాన్ని ప్రయాణికుల బోగీలోకి (Scooty in the passenger compartment) ఎక్కించడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది రైలు అనుకున్నావా.. లేక నీక ఇల్లు అనుకున్నావా’’.. అంటూ కొందరు, ‘‘స్కూటీని ఇలాక్కూడా తీసుకెళ్లవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 వేలకు పైగా లైక్‌లు, 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..