Rinku Singh: ఐదు సిక్సర్ల అల్లకల్లోలానికి ముందు.. రింకు సింగ్-యశ్ దయాళ్ ఇన్‌స్టాగ్రామ్ చాట్ వైరల్!

ABN , First Publish Date - 2023-04-10T16:42:27+05:30 IST

ఐపీఎల్‌(IPL 2023)లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో

Rinku Singh: ఐదు సిక్సర్ల అల్లకల్లోలానికి ముందు.. రింకు సింగ్-యశ్ దయాళ్ ఇన్‌స్టాగ్రామ్ చాట్ వైరల్!

గుజరాత్: ఐపీఎల్‌(IPL 2023)లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్(KKR) బ్యాటర్ రింకు సింగ్(Rinku Singh) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. గుజరాత్ బౌలర్ యశ్ దయాళ్(Yash Dayal) బౌలింగులో వరుస సిక్సర్లతో స్టేడియంలో కల్లోలం రేపాడు. తన బౌలింగులో రింకు సిక్సర్లు కొడుతుంటే అలా చూస్తుండడం తప్ప దయాళ్ చేష్టలుడిగి చూస్తుండడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. మ్యాచ్ అనంతరం గతంలో రింకు, దయాళ్ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన చాటింగ్ తాజాగా వైరల్ అవుతోంది. అంతకుముందు రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ రింకూసింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 33 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు.

ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత రింకు, యశ్ దయాళ్ ఇద్దరి మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాకెక్కింది. ‘‘ఇది చిరస్మరణీయ విజయం. ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరైనందుకు, తమకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు’’ అని రింకూ పేర్కొన్నాడు. దీనికి యశ్ బదులిస్తూ.. ‘‘గొప్ప ఆటగాడివి భాయ్’’ అని బదులిచ్చాడు. దీనికి రింకూ.. ‘భాయ్’ అని సంబోధిస్తూ హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు.

ఆదివారం గుజరాత్‌తో మ్యాచ్‌లో దయాళ్ బౌలింగులోనే రింకూ చితక్కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిపెట్టాడు. రింకు గతేడాదిలానే చేస్తాడన్న నమ్మకం తమకు కొంత ఉండేదని కేకేఆర్ స్కిప్పర్ నితీశ్ రాణా మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. రెండో సిక్సర్‌ పడిన తర్వాత పూర్తిగా నమ్మకం వచ్చిందన్నాడు. అయితే, ఇలాంటివి జరగడానికి వందలో ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుందని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-04-10T16:44:09+05:30 IST

News Hub