Nokia: 50 మెగాపిక్సెల్ కెమెరాతో నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల
ABN , First Publish Date - 2023-06-28T15:44:38+05:30 IST
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ మార్కెట్‌లో 6.56 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480ఎస్‌ఓసీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13, 50 మెగాపిక్సెల్ కెమెరాతో నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు నోకియా లైసెన్స్ బ్రాండ్ హెచ్‌ఎండీ గ్లోబల్ పేర్కొంది.
నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ ధర
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 20,800 ఉంటుంది. ఇండియా మార్కెట్‌లో ఈ సంవత్సరం మూడో త్రైమాసికం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..
6.56 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480ఎస్‌ఓసీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెన్సార్, 20డబ్ల్యూ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో ఎస్డీ కార్డుతోపాటు మూడేళ్ల వరకు ప్రతినెల సెక్యూరిటీ అప్‌డేట్, రెండేళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్ ఉంటుందని కంపెనీ తెలిపింది.