కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు బలం
ABN , First Publish Date - 2023-04-08T00:15:31+05:30 IST
కార్యకర్తలే బీఆర్‌ఎస్ పా ర్టీకి బలమని, సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత రవీంద్రకుమార్, నోముల భగత అన్నారు. జిల్లాలోని కొండమల్లేపల్లి, మాడ్గులపల్లి మండలంలోని కన్నెకల్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు.

కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు బలం
జడ్పీ చైర్మన నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భగత
కొండమల్లేపల్లి, మాడ్గులపల్లి, ఏప్రిల్ 7: కార్యకర్తలే బీఆర్‌ఎస్ పా ర్టీకి బలమని, సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత రవీంద్రకుమార్, నోముల భగత అన్నారు. జిల్లాలోని కొండమల్లేపల్లి, మాడ్గులపల్లి మండలంలోని కన్నెకల్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మోదీ పాలన నుంచి దేశాన్ని విముక్తి కల్పించేందుకే టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎ్‌సగా రూపాంతరం చెందిందని అన్నారు. బీజేపీ ఏలుబడిలో దేశంలో దారిద్య్రం విలయతాండవం చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చే యాలని అన్నారు. ఈ నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించాలన్నా రు. బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత దస్రూనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివా్‌సగౌడ్, పస్నూరి యుగేందర్‌రెడ్డి, కేసా ని లింగారెడ్డి, మేకల శ్రీనివా్‌సయాదవ్, కడారి అంజయ్య, నేనావత రాంబాబునాయక్, ఎంపీపీలు మాధవరం సునీతజనార్ధనరావు, వంగాల ప్రతా్‌పరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్‌రావు, వెల్గూరి వల్లపురెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీనివా్‌సరావు, నాగార్జునరెడ్డి, ఏడుకొండలుయాదవ్, రవీందర్‌రెడ్డి, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఫ సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత అన్నారు. మాడ్గులపల్లి మండలంలోని కన్నెకల్ గ్రామంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం అమలుచేస్తున్న పథకాల గురించి వివరించారు. బీఆర్‌ఎ్‌సను ఆదరించాలని కోరారు. సాగర్ నియోజకవర్గంలో 36ఏళ్లు పాలించిన జానారెడ్డి నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. కాంగ్రె్‌సకు ఓటు బ్యాంకు లేదని, బీజేపీకి క్యాడర్ లేదని విమర్శించారు. ని యోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరిగతిన పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన ఇస్లావత రామచంద్రనాయక్, జడ్పీ వైస్‌చైర్మన ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన యడవెల్లి విజయేందర్‌రెడ్డి, డీసీసీడీ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు చే కూరి హన్మంతరావు, వల్లం రవి, పార్టీ మండల అధ్యక్షుడు బాబయ్య, జిల్లా కోఆప్షన సభ్యుడు మోసినఅలీ, పగిళ్ల సైదులు, రాజు, పిచ్చిరెడ్డి, సర్పంచలు కాటెపల్లి సరివెంకన్న, పద్మశ్రీనివా్‌సరెడ్డి, చామంతి నర్సింహ, రామచంద్రమ్మ, ఆవుల అనితవెంకన్న, నాయకులు పాల్గొన్నారు.