Gurukula Schools: గురుకులాల్లో ప్రవేశానికి 38,278 మంది అర్హత
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:40 AM
రాష్ట్ర గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహించిన పరీక్షా ఫలితాలను టీజీసెట్- 2025 చీఫ్ కన్వీనర్ డా విఎస్ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు.

గురుకుల సెట్ -2025 ఫలితాల వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహించిన పరీక్షా ఫలితాలను టీజీసెట్- 2025 చీఫ్ కన్వీనర్ డా విఎస్ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు. గత ఫిబ్రవరి 23న జరిగిన ప్రవేశ పరీక్షకు మొత్తం 84,672 మంది విద్యార్థులు హాజరు కాగా 36,334 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల విద్యార్థులు అర్హత సాధించారు.
రాష్ట్ర గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి 51,408 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే 1,944 ప్రత్యేక కేటగిరీ సీట్ల ఫలితాలు ప్రకటించినట్లు వర్షిణి తెలిపారు. మిగతా 13,130 సీట్ల ఫలితాలు దశలవారీగా ప్రకటిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News