Share News

Revanth Reddy : నేనే సీఎం అయితే కేసీఆర్‌ను ఏం చేస్తానంటే..!?

ABN , First Publish Date - 2023-11-16T20:01:51+05:30 IST

ABN Big Debate With Revanth Reddy : తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది.. డిసెంబర్-09న గచ్చిబౌలిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని టీపీసీసీ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే...

Revanth Reddy : నేనే సీఎం అయితే కేసీఆర్‌ను ఏం చేస్తానంటే..!?

తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది.. డిసెంబర్-09న గచ్చిబౌలిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని టీపీసీసీ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి..? రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గులాబీ బాస్ కేసీఆర్‌ను ఏం చేయబోతున్నారనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘బిగ్ డిబేట్’లో నిశితంగా వివరించారు.


Revanth-Big.jpg

ఆర్కే : రేపు కాలం కలిసొచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్‌పైన ప్రతీకారం తీర్చుకుంటారా..?

రేవంత్ రెడ్డి : లేదు.. అస్సలు లేదు.. చాలా మంది నా విధానాన్ని చూసి ఇలానే అనుకుంటున్నారు. కానీ అది కానేకాదు. ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగత పగ, కోపాన్ని కక్షలు సాధించుకోవడానికి కాదు.. దొరికాడురా అని ఇక పగ తీర్చుకోవాలని అస్సలు కానే కాదు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకాన్ని పెట్టుకుని అధికారం ఇస్తారు. ఒక వ్యక్తి ఏదో అలా చేశాడని నేను కూడా అలా చేస్తానని అనుకోవడం అస్సలు తప్పు.. నేను చేయనంటే చేయను.

ఆర్కే : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ కుటుంబంపైన ఎలాంటి విచారణ జరగదా..?

రేవంత్ రెడ్డి : ఏ విధమైన విచారణ జరగదు అనేది చాలా తప్పు. వ్యక్తిగత కక్ష, అక్రమ అరెస్ట్ వేరు.. చట్టబద్ధంగా చేయడం వేరు. మీరు (ఆర్కే) నన్ను కమిట్ చేయాలని చూస్తున్నారు. నిర్ణయాలు అనేవి విధానపరంగా, పరిపాలనపరంగా సమీక్షించినప్పుడు చట్టం ప్రకారం చేస్తాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలాగా మేం ప్రవర్తించం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది.. అది ప్రభుత్వం అమలు చేస్తుంది. అంతేకానీ రేవంత్ అనేవాడు ఎలాంటి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోరు. ఎన్టీఆర్, వైఎస్సార్ సెంటిమెంట్‌తో ఎల్బీనగర్‌లో డిసెంబర్-09న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఆరు గ్యారెంటీ స్కీముల మీద మొదటి సంతకాలు ఉంటాయి.

kcr.jpg

Updated Date - 2023-11-16T20:03:08+05:30 IST