Share News

పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:21 PM

పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించినట్లు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం
కోయిలకొండలో బియ్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

- నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

కోయిలకొండ ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించినట్లు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. కోయిలకొండ మండల కేంద్రంలో 1వ చౌకధర దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. సన్న బియ్యం అత్యధికంగా పండించే దిశగా ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు బోనస్‌ అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌గౌడ్‌ నాయకులు సత్యపాల్‌రెడ్డి, జగన్‌గౌడ్‌, శేఖర్‌, రామస్వామి, యాదవ్‌కుమార్‌, గౌస్‌, నాగరాజు, విక్రమ్‌గౌడ్‌, డీలర్ల సంఘం నాయకులు భీంరెడ్డి, నర్సిములు, ఆనంద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:21 PM