రైల్వే ఫ్లైఓవర్ నిర్మించరూ..
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:29 PM
దామరచర్ల నుంచి వీర్లపాలెం, తాళ్లవీర్పగూడెం, ఉల్సాయిపాలెం, అడవిదేవులపల్లి గ్రామాలకు తరచుగా వివిధ అవసరాల కోసం దామరచర్ల, మిర్యాలగూడ ప్రాం తాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రైతు లు తమ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు తీసుకురావడానికి, గొర్రెలు, పశువులను సంతకు తరలించడానికి ట్రాక్టర్లు గూడ్స్ ఆటోలపై ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఎక్కువగా గిరిజన ప్రజలు నివసిస్తున్నందున చిన్న చిన్న అవసరాలకు టౌనకు వచ్చిపోవడం తప్పని సరైందని రైల్వే ట్రాక్ వల్ల తరుచుగా ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. కాగా సమస్య పరిష్కారానికి రైల్వే అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

థర్మల్ పవర్ ప్లాంట్‌తో పెరిగిన రద్దీ
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వీర్లపా లెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట ్‌తో ఈ మార్గంలో విపరీతమైన వాహనాల రద్దీ ఏర్పడింది. పవర్‌ప్లాంట్ నిర్మాణం కోసం దూరప్రాంతాల నుంచి ఇనుము, స్టీల్, యంత్ర పరికరాలు లాంటివి పవర్‌ప్లాంట్‌కు చేరవేసేందుకు పెద్దపెద్ద వాహనాలు వస్తుటాయి. దీని వల్ల రైల్వే గేటు వద్ద రాకపోకలు నిలిచినప్పుడు గేట్ల వద్ద రెండువైపులా మరిన్ని వాహనాలు నిలిచి గేట్లు ఎత్తినప్పుడు ట్రాక్ దాటానికి టూవీలర్లకు సైతం కష్టంగా మారుతోంది అధికారులు ట్రాఫిక్ ఇబ్బందులు గమనించి విష్ణుపురం నుంచి థర్మల్ పవర్‌ప్లాంట్ వరకు బొగ్గు రవాణా కోసం నూతనంగా ఏర్పాటు చేసిన 8 కి.మీ రైల్వే ట్రాక్‌కు దామరచర్ల- తాళ్లవీరప్పగూడెం వద్ద అండర్‌పాస్ ఏర్పాటు చేశారని, అదే తరహలో దామరచర్ల వద్ద ఏర్పాటు చేయడమో వీలు కాని పక్షంలో ఫ్లైఓవర్ నిర్మించడమో చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బొత్తలపాలెం ప్రమాదంలో అప్రమత్తం
దామరచర్ల రైల్వేగేటుకు 3 కి.మీ దూరంలో ఉన్న బొత్తలపాలెం రైలుపట్టాలపై గేటు లేక పోవడంతో గతంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. తండాల నుంచి మిర్యాలగూడ ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులను తీసుకవస్తున్న బస్సు ను రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన తీవ్రతకు చలించిన రైల్వే అధికారులు రైల్వే గేటు ను ఏర్పాటు చేసి రైళ్ల ప్రయాణ సమయంలో వాహనాలు, ప్రయాణికులు పట్టాలపైకి రాకుండా ప్రమాదాలు నివారణకు ఏర్పాట్లు చేశా రు. బొత్తలపాలానికి సమీపంలోని రాళ్లవాగు తండా వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో అధికారులు రైల్వే గేటు ఏర్పా టు చేసి కాపలాదారుని నియమించారు.
అండర్‌పాస్ ఉపయోగం ఉండదని నిలిపివేశారు
దామరచర్ల - వీర్లపాలెం రైల్వేగేటు వద్ద నాలుగేళ్ల క్రితమే అండర్‌పాస్ మంజూరైంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు నిర్మాణ సామగ్రి, యంత్ర పరికరాలు రవాణా చేసేందుకు భారీ వాహనాలు, కంటైనర్లు ఆ మార్గంలో ప్రయాణిస్తునందున అండర్‌పాస్ ఉపయోగం ఉండదని ఏర్పాట్లు నిలిపివేశారు. ప్రస్తుతం రైల్వే డబ్లింగ్ పనులు నడుస్తున్నందున ఫ్లైఓవర్ ఏర్పాట్ల విషయం గురించి సమాచారం లేదు.
-సూర్యనారాయణ, నడికుడి-మిర్యాలగూడ రైల్వే ఇంజినీర్