Share News

గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:23 PM

గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, చెరువులు, పంట కాలువల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం
మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

గొలుగొండ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, చెరువులు, పంట కాలువల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మండలంలోని గుండుపాలెం గ్రామంలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు ఉదయం ఏడుగంటల లోపే పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులను సూచించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 41,528 మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. గొలుగొండ మండలంలో 170 సిమెంట్‌ రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించామన్నారు. అనంతరం కొత్తూరు గ్రామంలో తలుపులమ్మ అమ్మవారికి స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యుడు రవివర్మ వెండి కిరీటం బహూకరించడంతో దానిని అయ్యన్న, ఆయన సతీమణి పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ చేతుల మీదుగా అమ్మవారికి ఽఅలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీవీ రమణ, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో మేరీరోజీ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, జనసేన నాయకుడు రాజాన వీరసూర్యచంద్ర, మరో డైరెక్టర్‌ పుల్లేటికుర్తి రమేశ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, పార్టీ మండల నాయకులు కొల్లి సత్తిబాబు, కొల్లి రాంబాబు, భీమిరెడ్డి సత్యనారాయణ, చినబ్బాయి, కామిరెడ్డి గోవింద్‌, కర్రి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:23 PM