పదేళ్లలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:22 PM
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేద ప్రజలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, పేదలను నిరుపేదలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు.

- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
- తాటికొండలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
భూత్పూర్, మూసాపేట ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేద ప్రజలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, పేదలను నిరుపేదలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మండలంలోని తాటికొండ గ్రామం, భూత్పూర్ మునిసిపాలిటీ కేంద్రంలోని 9వ వార్డులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాటికొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు కూడా సన్నబియ్యం అందించాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కాని, ఒక్క కిలో సన్న బియ్యం కాని ఇవ్వలేదన్నారు. తాటికొండ గ్రామానికి త్వరలో రూ.3.50 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్, అదే విధంగా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జయలక్ష్మి, మాజీ సర్పంచ్ హర్యానాయక్, నాయకులు రవీంద్‌రెడ్డి, ఎర్రవాపు నర్సిములు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సాయిలు, పవన్‌కుమార్, మలిశెట్టి వెంకటేష్, శివరాములు, హస్నాపూర్ మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మూసాపేట మండలం వేముల గ్రామం, అడ్డాకుల మండల కేంద్రంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, తహసీల్దార్ శేఖర్, ఆర్.రాజు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్, తోట శ్రీహరి, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలనర్సింహులు పాల్గొన్నారు.