Revanth Reddy: మంత్రులతో తొలిసారి సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
ABN , First Publish Date - 2023-12-07T16:21:10+05:30 IST
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కొన్ని గంటల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరింది. రేవంత్‌తో సహా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రమే
హైదరాబాద్: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కొన్ని గంటల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరింది. రేవంత్‌తో సహా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రమే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. అనంతరం కొత్త మంత్రులతో 5 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేసిన నేపథ్యంలో వీటి అమలుపై మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పథకాల అమలు, ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాలపై మంత్రివర్గంతో చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ అగ్ర నేతలంతా తాజ్ కృష్ణ హోటల్‌కి చేరుకున్నారు. వీరితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి , తన కేబినేట్ మంత్రులు హోటల్‌కి వచ్చారు. సోనియా , రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో రేవంత్‌రెడ్డి, మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం ముగియడంతో సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే మళ్లీ తిరిగి ఢిల్లీకి బయల్దేరారు. ఈ మేరకు తాజ్ కృష్ణ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మంత్రులు వెళ్లారు. ఏఐసీసీ అగ్ర నేతలకు వీడ్కోలు పలకనున్నారు.