Share News

మరీ ఇంత దారుణంగా అయ్యారేంటి.. ఆటోలోనే దుకాణం పెట్టేశారు..

ABN , Publish Date - Apr 02 , 2025 | 07:16 PM

ఆ ఇద్దరు అమ్మాయిలు ఆటోలో కూర్చుని ఉన్నారు. ఓ వ్యక్తి అటువైపుగా వెళుతూ.. వీళ్లను చూసి ఆగాడు. వాళ్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

మరీ ఇంత దారుణంగా అయ్యారేంటి.. ఆటోలోనే దుకాణం పెట్టేశారు..
Mumbai News

ఈ సమాజం ఎటుపోతోందో అర్థం కావటం లేదు. ఈ మధ్య కాలంలో యువత దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు మగాళ్లతో సమానంగా మందు, సిగరెట్, డ్రగ్స్‌కు బానిస అవుతున్నారు. తాజాగా, ఓ ఇద్దరు యువతులు పట్టపగలు ఆటోలో దుకాణం పెట్టేశారు. నలుగురు పోయే దారిలో ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని ముంబైలో వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని మలద్, మాల్వానీ ఏరియాకు చెందిన ఓ ఇద్దరు అమ్మాయిలు ఆటోలో కూర్చుని ఉన్నారు. పక్కపక్కనే కూర్చుని డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు.


అటు వైపుగా వెళుతున్న ఓ వ్యక్తి వారిని చూసి ఆగాడు. వాళ్ల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారని అడిగాడు. డ్రగ్స్ తీసుకుంటున్నామని వారు పబ్లిక్‌గానే చెప్పేశారు. ‘ డ్రగ్స్ తీసుకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది’ అని చెప్పాడు. దానికి ఓ అమ్మాయి సమాధానం ఇస్తూ.. ‘ మేము డ్రగ్స్‌కు బానిస అయిపోయాము. అవి లేకుండా బతకలేము’ అని చెప్పింది. ‘ మీకు ఈ డ్రగ్స్ ఎక్కడ దొరికాయి?.. వాటి రేటు ఎంత?’ అని ఆ వ్యక్తి అడిగాడు. వాళ్లు డ్రగ్స్ ఎక్కడినుంచి తెచ్చుకున్నారో చెప్పారు. రెండు పాకెట్లు కలిపి 200 రూపాయలు అని చెప్పారు. ఆ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.


‘ డ్రగ్స్ అమ్మటం, కొనటం.. వడాపావ్ కొనటం కంటే తేలిక అయిపోయింది. రెండిటి రేటు కూడా అంతే ఉంది. ముంబైలో రెండు పీసుల వడాపావ్ ధర 190 రూపాయలు ఉంది. 2 ప్యాకెట్ల డ్రగ్స్ ధర 200 రూపాయలు ఉంది. మరి మీరు దేన్ని కొంటారు?’ అని ప్రశ్నించాడు. ఆ సంఘటన ఎక్కడ జరిగిందో ప్రాంతం పేరు కూడా పెట్టాడు. ఆ పోస్టును ముంబై పోలీసులు, మహారాష్ట్ర సీఎంఓతో పాటు మరికొంతమందికి కూడా ట్యాగ్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు ఉన్నతాధికారులు వీడియోపై స్పందించారు. మల్వానీ పోలీస్ స్టేషన్ అధికారులకు సంఘటనపై విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

Poonam Gupta: కొత్త ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా గురించి తెలుసా..

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..

Updated Date - Apr 02 , 2025 | 07:16 PM