Share News

BCCI: టీమిండియా దేశవాళీ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

ABN , Publish Date - Apr 02 , 2025 | 08:17 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సీనియర్ పురుషుల జట్టు దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారతదేశంలో పర్యటించనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

BCCI: టీమిండియా దేశవాళీ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
BCCI Announces home Schedule

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సీనియర్ పురుషుల జట్టు దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. బోర్డు విడుదల చేసిన ప్రకటనలో, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఈ సంవత్సరం భారతదేశంలో పర్యటిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు అహ్మదాబాద్‌లో, రెండో మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి కోల్‌కతాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు భారతదేశంలో పర్యటిస్తుంది. ఈ సమయంలో రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతాయి.


భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్: అక్టోబర్ 02 (గురువారం) - అక్టోబర్ 06 (సోమవారం) ఉదయం 9:30 గంటలకు అహ్మదాబాద్‌లో

  • రెండో టెస్ట్: అక్టోబర్ 10 (శుక్రవారం) - అక్టోబర్ 14 (మంగళవారం) ఉదయం 9:30 గంటలకు కోల్‌కతాలో

భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్ నవంబర్ 14 (శుక్రవారం) - నవంబర్ 18 (మంగళవారం) ఉదయం 9:30 గంటలకు న్యూఢిల్లీ

  • రెండో టెస్ట్: నవంబర్ 22 (శనివారం)-నవంబర్ 26 (బుధవారం) ఉదయం 9:30 గంటలకు గౌహతిలో


భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్

  • మొదటి వన్డే: నవంబర్ 30 (ఆదివారం) మధ్యాహ్నం 1:30 గంటలకు రాంచీలో

  • డిసెంబర్ 3 (బుధవారం) రెండో వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు రాయ్‌పూర్‌లో

  • మూడో వన్డే డిసెంబర్ 6 (శనివారం) మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం

భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి టీ20 డిసెంబర్ 9 (మంగళవారం) రాత్రి 7 గంటలకు కటక్

  • రెండో T20 డిసెంబర్ 11 (గురువారం) రాత్రి 7 గంటలకు ఛండీగఢ్

  • 3వ T20 డిసెంబర్ 14 (ఆదివారం) రాత్రి 7 గంటలకు ధర్మశాల

  • 4వ టీ20 డిసెంబర్ 17 (బుధవారం) లక్నో సాయంత్రం 7 గంటలకు

  • 5వ T20 డిసెంబర్ 19 (శుక్రవారం) రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్


ఇవి కూడా చదవండి:

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..


Yashasvi Jaiswal: ముంబై జట్టుకు గుడ్ బాయ్ చెప్పిన యశస్వి జైస్వాల్..అసలేమైంది..


Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 02 , 2025 | 08:21 PM