Telangana Results : వావ్.. వివేక్.. అదరగొట్టేశారుగా!
ABN , First Publish Date - 2023-12-03T15:24:58+05:30 IST
చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఓటర్లు గట్టి షాకిచ్చారు. ఊహించిన విధంగానే కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘనవిజయం సాధించారు.
చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఓటర్లు గట్టి షాకిచ్చారు. ఊహించిన విధంగానే కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 37, 189 ఓట్ల తేడాతో వివేక్ గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే హస్తం పార్టీ సూపర్ విక్టరీ నమోదు చేసింది.
లేటుగా వచ్చినా..!!
వివేక్ వెంకటస్వామి చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి చెన్నూర్ టికెట్ దక్కించుకున్నారు. బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్‌ను రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కోరిన విధంగానే వివేక్ కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాకుండా చెన్నూర్ టికెట్ కేటాయించగానే వివేక్ ప్రచారంలోకి దూసుకుపోయారు. మొత్తానికి చెన్నూర్ ప్రజలు వివేక్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఆదరించారు. వివేక్ ఫ్యామిలీ గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు. గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా తెలుగు ప్రజలకు తెలియనిది కాదు. కాకా తర్వాత రాజకీయ వారసత్వం తీసుకున్న కుమారులు పార్టీలు మారినప్పటికీ రాణిస్తున్నారు. ఈ మధ్యనే బీజేపీకి గుడ్ బై చెప్పిన వివేక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన సీనియార్టీ, ప్రజల్లో ఫాలోయింగ్‌ను చూసిన హైకమాండ్ చెన్నూరు టికెట్ కేటాయించింది. హస్తం పార్టీలోకి లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా గెలిచి నిలిచారు.
ఇదీ బాల్క సుమన్ కథ!
బాల్క సుమన్... బీఆర్ఎస్‌లో ఒక ముఖ్య నేత. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓయూ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉంటూ అంచెలంచెలుగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో కీరోల్ పోషించి బీఆర్ఎస్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2018లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో చెన్నూర్ అసెంబ్లీకి పోటీ చేసి విక్టరీ సాధించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాల్క సుమన్‌కు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టింది.
తాజాగా.. జరిగిన ఎన్నికల్లో చెన్నూర్ టికెట్‌ను మళ్లీ బాల్క సుమన్‌కే బీఆర్ఎస్ అధిష్టానం కేటాయించింది. అయితే బాల్క సుమన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఏర్పడింది. అయినా కూడా ఎలాంటి మార్పు చేయలేదు. దీన్ని క్యాష్ చేసుకున్న కాంగ్రెస్.. మంచి అనుకూల సమయం చూసి వివేక్ వెంటస్వామిని రంగంలోకి దింపి గట్టి పోటీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే వివేక్ బంపర్ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్‌కు అధికారం రావడంలో వివేక్ తన వంతు పాత్ర పోషించారు.