KTR : రేవంత్‌రెడ్డి అక్కడ కూడా ఓడిపోతాడు
ABN , First Publish Date - 2023-11-26T17:08:47+05:30 IST
కాంగ్రెస్ ( Congress ) , బీజేపీ ( BJP ) పార్టీల నాయకులు రోజుకోక డ్రామా ఆడుతున్నారని.. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనలేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) ప్రశ్నించారు.
మెదక్ జిల్లా: కాంగ్రెస్ ( Congress ) , బీజేపీ ( BJP ) పార్టీల నాయకులు రోజుకోక డ్రామా ఆడుతున్నారని.. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనలేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) ప్రశ్నించారు. ఆదివారం నాడు నర్సాపూర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘ఈ సభకు భారీగా తరలివచ్చిన జనాలను చూస్తే సునీతరెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తుంది. 2014 ముందు కరెంట్ కోసం పడ్డ కష్టాలు గుర్తుంచుకోండి. కరెంటు కష్టాలు కాంగ్రెస్ నాయకులకు తెలియదు. బీసీ బిడ్డ గొంతు కోసి కాంగ్రెస్ టికెట్ అమ్ముకున్నాడు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు. కౌలు రైతుకు రైతుబంధు ఇవ్వాలి అని కాంగ్రెస్ అనలేదా. రేవంత్‌రెడ్డి రైతుబంధు దుబారా అని అనలేదా’’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
సిలిండర్‌ను మోదీ 1200 వందలు చేశారు
‘‘70 లక్షల రైతుల ఖాతాల్లో 73000 కోట్లు వేసిన ఘనత కేసీఆర్‌ది. తెలంగాణను నష్టం చేసిన వారు ఒక్క ఛాన్స్ అని వచ్చి అడుగుతున్నారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో కామారెడ్డిలో ఓడిపోతాడు. రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. 400 సిలిండర్ 1200 వందల రూపాయలు చేసిన ఘనత మోదీది, తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత కేసీఆర్‌ది. అసైన్డ్ భూములను కేసీఆర్ పట్టాలు చెయబోతున్నారు సునీతరెడ్డి గెలిపిస్తే నర్సాపూర్‌కు ఐటీ హబ్, పరిశ్రమలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేపడతాం. మదన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులకు న్యాయమైన స్థానం కల్పిస్తాం.బీఆర్ఎస్ గెలిస్తే నర్సాపూర్‌ను చార్మినార్ జోన్‌లో కలుపుతాం’’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి