Share News

BJP : 18న బీజేపీ మేనిఫెస్టో విడుదల

ABN , First Publish Date - 2023-11-16T17:06:06+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర అగ్ర నాయకులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేలా పలు ప్రణాళికలను రచించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తెలంగాణలో పర్యటించేలా పలు పధకాలు రెడీ చేసింది.

BJP : 18న  బీజేపీ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర అగ్ర నాయకులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేలా పలు ప్రణాళికలను రచించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తెలంగాణలో పర్యటించేలా పలు పధకాలు రెడీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాష్ట్రంలో విస్రృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేసింది. 18వ తేదీన ఉదయం 9గంటలకు అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం గద్వాల, ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎన్నికల సభల్లో అమిత్ షా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఎమార్పీఎస్ నేతలతో అమిత్ షా భేటీ అవుతారు. అమిత్ షాతో సమావేశంలో మంద కృష్ణమాదిగ పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

19న తెలంగాణకు నడ్డా రాక

ఈ నెల 19న తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు సభల్లో నడ్డా పాల్గొననున్నారు. చేవెళ్ల, నారాయణ పేట్ బహిరంగ సభలకు నడ్డా హాజరుకానున్నారు. సాయంత్రం మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో నడ్డా రోడ్ షో‌ ఉంటుంది.

బీజేపీకి తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముఖ్యం: లక్ష్మణ్

వెనుకబడిన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములును చేయటమే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గురువారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘స్వలాభం.. భవిష్యత్తు కోసం పార్టీల మారే వారు మారుతారు. బీజేపీకి తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముఖ్యం. బీసీ కుల గుణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా కుల గణన చేస్తాం. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవటం‌ ఖాయం. ఓటు ద్వారా యువత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. నిరుద్యోగులు ఫూల్స్ కాదు.‌. ప్రభుత్వాన్ని కూల్చే షూటర్స్. అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రచార ఉండబోతోంది. తెలంగాణలో 60లక్షల మందికి పైగా యువత బీజేపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగాల భర్తీపై ట్విట్టర్ టిల్లు కేటీఆర్ కాకి లెక్కలు చెప్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమొద్దు. ప్రవళ్లిక ఉసురు ఊరికే పోదు. కేసీఆర్ సర్కార్‌కు తగిన శాస్తి జరుగుతుంది. నిరుద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం ప్రేరేపిస్తుంది. 50వేల జీతం సంపాదించే పిల్లలు భవిష్యత్తు ముఖ్యమా? రెండు వేల పెన్షన్ మఖ్యమా?తల్లిదండ్రులు ఆలోచించాలి’’ అని లక్ష్మణ్ అన్నారు.

Updated Date - 2023-11-16T19:49:50+05:30 IST