Share News

Amit Shah : ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పై ఒక్కసారిగా మారిన ‘షా’ టోన్..!!

ABN , First Publish Date - 2023-11-20T22:40:06+05:30 IST

Amit Shah Road Show In Uppal : అవును.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కేంద్ర మంత్రి అమిత్ షా ‘టోన్’ మార్చేశారు!. ఇప్పటి వరకూ బీజేపీ ఊసు బీఆర్ఎస్ ఎత్తకపోవడం.. ‘కారు’ పార్టీ గురించి కమలనాథులు మాట్లాడకపోవడంతో ఏదో తేడా కొడుతోందే.. కుమ్మక్కయ్యారా..? అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు ఉండేవి..

Amit Shah : ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పై ఒక్కసారిగా మారిన ‘షా’ టోన్..!!

అవును.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కేంద్ర మంత్రి అమిత్ షా ‘టోన్’ మార్చేశారు!. ఇప్పటి వరకూ బీజేపీ ఊసు బీఆర్ఎస్ ఎత్తకపోవడం.. ‘కారు’ పార్టీ గురించి కమలనాథులు మాట్లాడకపోవడంతో ఏదో తేడా కొడుతోందే.. కుమ్మక్కయ్యారా..? అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు ఉండేవి. గులాబీ దళపతి కేసీఆర్ మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభల్లో మాట్లాడినా కేంద్రంలోని బీజేపీ పాలన, ప్రధాని మోదీ, అమిత్ షాల ప్రస్తావన.. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతల ప్రస్తావనకు కచ్చితంగా తెచ్చేవారు. పంచ్‌లు, ప్రాసలు, కౌంటర్లతో హోరెత్తించేవారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో పెద్దగా బీజేపీని పట్టించుకోలేదు. ఒకవేళ మాట్లాడినా తగిలీతగలన్నట్లుగా ప్రసంగించేవారు. దీంతో మరింత రాష్ట్ర ప్రజలు, అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ క్యాడర్‌లో ఎక్కడలేని అనుమానాలు పుట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా.. కేసీఆర్‌పై ఒక్కసారిగా స్వరం మార్చేశారు. ఇక తగ్గేదేలే అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


Amit-Shah-Uppal.jpg

బరాబర్ పంపుతాం!

సోమవారం నాడు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తరఫున అగ్రనేత అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్నిరోజులు బీజేపీ క్యాడర్, రాష్ట్ర ప్రజానీకంలో ఉండే అనుమానాలన్నీ పటాపంచలు చేసేశారు.అవును.. బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లల్లో అవినీతికి పాల్పడింది. కేసీఆర్‌ను జైలుకు పంపుతాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతిపరులందరినీ జైలుకు సాగనంపుతాం. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మహిళలకు ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లను అందజేస్తాం. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజ్ కల్పిస్తామని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్పుట్ అసిస్టెన్స్ అందిస్తాం. తెలంగాణలో డిసెంబర్-03న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధమేనా?. 2024లో మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు సిద్ధమేనా..? బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలిఅని అని ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-20T22:47:13+05:30 IST